How To Increase Sperm Count In 4 Days: ప్రస్తుతం చాలామంది వివాహం తర్వాత తండ్రి కావాలని కోరుకుంటారు. కానీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా స్పర్మ్ కౌంటర్ నాణ్యత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు విటమిన్ లోపం వల్లనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామందిలో ఆధునిక జీవనశైలి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే భవిష్యత్తులో పిల్లలను కనే అవకాశాలు కూడా తక్కువ అవుతాయి. కాబట్టి దీనికోసం పాలు పోషకాలు ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వేటిన ఆహారంగా తీసుకుంటే స్పెర్మ్ కౌంటు నాణ్యత పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జింక్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు:
శరీరానికి జింక్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా జింక్, అధిక పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే సులభంగా స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పోషకాహారా సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా జింక్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
విత్తనాలు:
చాలామంది శరీరం దృఢంగా, బరువు తగ్గే క్రమంలో విత్తనాలను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ కౌంటింగ్ పెంచుకోవడానికి కూడా విత్తనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీనికోసం గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇందులో శరీరానికి కావాల్సిన ఒమేగా3, కొవ్వులు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ ఈ పెరిగి.. స్పెర్మ్ కౌంట్ నాణ్యత కూడా పెరుగుతుంది. అంతేకాకుండా సంతాన సమస్యలు కూడా దూరం అవుతాయి.
కాబట్టి తప్పకుండా ఈ గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ లో పరిమాణం ఎక్కువగా ఉండే అవిస గింజలు, చియా గింజలు పొద్దు, తిరుగుడు గింజలు తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ రసం:
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ లో పరిమాణం అధికంగా ఉంటుంది. అయితే వీటిని రసం చేసుకొని తాగడం వల్ల సంతాన సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేయండి.
చేపలు:
సాధారణంగా చేపల్లో శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఇందులో ఉండే మూలకాలు స్పెర్మ్ నాణ్యత ను కూడా పెంచేందుకు సహాయపడతాయి. కాబట్టి దీనికోసం క్రమం తప్పకుండా సల్మన్ వంటి చేపలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook