Immediate Constipation Relief Fruits: క్షణాల్లో మలబద్దకం నుండి విముక్తి కలిగించే ఫ్రూట్స్

Immediate Constipation Relief Tips తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో ఈ పండ్లను తీసుకోవడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 24, 2023, 12:44 PM IST
Immediate Constipation Relief Fruits: క్షణాల్లో మలబద్దకం నుండి విముక్తి కలిగించే ఫ్రూట్స్

Immediate Constipation Relief Fruits: అనారోగ్యకరమైన ఆహారాలు రోజు తినడం వల్ల చాలా మంది మలబద్ధకం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో పీచు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఫైబర్ రిచ్ కలిగిన ఫ్రూట్స్ తినడం వల్ల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా యూరిక్‌ యాసిడ్‌ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఏయే పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడాని ఈ పండ్లు తినండి:

పియర్‌:
పియర్‌ పండ్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక పియర్‌లో 5.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

సిట్రస్ పండ్లు:
సిట్రస్ పండ్లలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. గ్రేప్‌ఫ్రూట్, ఆరెంజ్ వంటి పండ్ల ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. అంతేకాకుండా సులభంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక నారింజలో 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతి రోజు రెండు నారింజ పండ్లను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కివి:
కివి పండ్లు కూడా పొట్ట సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కివి పండ్లు గర్భిణీ స్త్రీలు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పోషకాహార లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పండ్లను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

జామ:
జామలో కూడా అధిక పరిమాణంలో పీచు ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని తినడం వల్ల సహజంగా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జామపండులో ఉండే మూలకాలు ప్రేగుల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also Read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News