Sugar Craving: తీపి మోతాదు మించితే చేదవుతుంది. ఎక్కువైతే ఎప్పటికీ అనర్ధమే. అయినా కొంతమంది తీపి పదార్ధాలు మానలేకపోతుంటారు. బరువును పెంచడంలో స్వీట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో స్వీట్స్ మానేయాలంటే..ఏం చేయాలో తెలుసుకుందాం.
సుగర్ క్రేవింగ్. అంటే స్వీట్స్ పట్ల వ్యామోహం లేదా ఇష్టం. ఈ అలవాటున్నవారు ఎంత నియంత్రించుకోవాలనుకున్నా సాధ్యం కాదు. స్వీట్స్ అదే పనిగా తినేస్తుంటారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికి లేదా మధుమేహంతో బాధపడుతున్నవారికి ఇది చాలా ఇబ్బంది కల్గించే పరిణామం. డైటింగ్‌లో ఉన్నప్పుడు ఫ్రైడ్ ఆహార పదార్ధాలు, స్వీట్స్ మానకపోతే బరువు పెరిగిపోతుంటుంది. కొంతమంది ఎంతగా ప్రయత్నించినా ఈ అలవాటును మానుకోలేరు. స్వీట్స్ తినకపోతే (Sugar Craving)ఏదో పోగొట్టుకున్నట్టు భావిస్తుంటారు. మరి ఏం చేయాలి. ఈ అలవాటున్నవారు కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే..స్వీట్స్ నుంచి దూరంగా ఉండవచ్చు.
ఒకవేళ మీకు స్వీట్స్ తినాలనే కోరిక ఉంటే..వెంటనే ఓ గ్లాసు నీళ్లు తాగేయండి. ఇలా చేస్తే మీ కడుపు నిండి ఆకలేయదు. ఇలా ఏదో ఒక రోజు కాదు..అదే అలవాటుగా చేసుకుంటే స్వీట్స్ నుంచి మైండ్ డైవర్ట్ అవుతుంది.
చాలామంది డైటింగ్ (Dieting) సందర్భంగా కఠినమైన నియమాల్ని పాటిస్తుంటారు. కేవలం పండ్లు మాత్రమే తింటుంటారు. వీటితో పాటు నట్స్ ఇతర పదార్ధాలు తినాల్సి ఉంటుంది. ఇవి చాలా ఆరోగ్యకరం. ఇలా చేస్తే మీరు ఎక్కువసేపు ఆకలిని నియంత్రించుకోవచ్చు. కేవలం పండ్లు తింటే మాత్రం ఇంకా ఏదో తినాలనే కోరిక ఉంటుంది.
ఎప్పుడైనా స్వీట్స్ (Sweets)లేదా మరేదైనా తినాలనుంటే వెంటనే కొద్దిదూరం వాకప్‌కు వెళ్లడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనముంటుంది. స్వీట్స్ నుంచి దూరంగా ఉండటమే కాకుండా..వర్కవుట్ లేదా వాకప్ కారణంగా ఫీల్‌గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి మీకు ప్రశాంతతను చేకూరుస్తాయి.
తీపి పదార్ధాలు తినాలనే కోరిక కలగడానికి ముఖ్య కారణం వల్ల బ్లడ్ సుగర్ లెవెల్స్ (Blood Sugar Levels)పెరగడంతో పాటు ఒత్తిడి కూడా ఓ కారణం. ఒకవేళ మీకు ఎప్పుడైనా కష్టంగా ఉన్నట్టు అన్పిస్తే..వెంటనే ఆరోగ్యకరమైన పదార్ధాలు తిని కడుపు నింపుకోండి. ఇలా చేస్తే స్వీట్స్ తినాలనే కోరిక పోతుంది. బరువు పెరగకుండా ఉంటుంది.
ఒకవేళ మీకు సరిగ్గా నిద్ర పట్టకపోయినా లేదా నిద్ర సరిపోకపోయినా..మీ దేహం స్వీట్స్ కోరుకుంటుంది. ఎందుకంటే శక్తి కోసం. అందుకే ప్రతి రోజూ కనీసం 6-8 గంటలు నిద్రపోయేందుకు ప్రయత్నించండి.
ఒకవేళ మీకు ఉదయం వేళల్లో బ్రేక్‌ఫాస్ట్‌గా ఆరోగ్యకరమైన పదార్ధాలు తీసుకుంటే మీకారోజు ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ఆ రోజంతా బాగుంటుంది. దీనివల్ల మీకు స్వీట్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ప్రోటీన్స్ ఉండే పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.
Also read: Diabetes: మధుమేహానికి చెక్ పెట్టే సులభమైన ఆరోగ్య చిట్కాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook