Diabetes: మధుమేహానికి చెక్ పెట్టే సులభమైన ఆరోగ్య చిట్కాలు ఇవే

Diabetes: దేశంలో ప్రతి ఒక్కరినీ వేధించేది డయాబెటిస్ సమస్య. ఆధునిక జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం బారిన పడుతున్నారు. సరైన ఆహార నియమాల్ని పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2022, 01:12 PM IST
Diabetes: మధుమేహానికి చెక్ పెట్టే సులభమైన ఆరోగ్య చిట్కాలు ఇవే

Diabetes: దేశంలో ప్రతి ఒక్కరినీ వేధించేది డయాబెటిస్ సమస్య. ఆధునిక జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం బారిన పడుతున్నారు. సరైన ఆహార నియమాల్ని పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.

ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా దేశంలో డయాబెటిస్ అనేది ఓ ప్రధాన సమస్యగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారులు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్స్ కారణంగా డయాబెటిస్ అనేది సాధారణమైపోయింది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఇంట్లో లభించే కొన్ని రకాల ఆహారాలతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. జన్యుపరమైన కారణాలు కూడా మధుమేహానికి దోహదపడుతుంటాయి. పొగాకు, మద్యం వంటివి కూడా మధుమేహానికి దారితీస్తాయి. అందుకే నిత్యం వ్యాయామం చేయడం, బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, తృణధాన్యాలు తీసుకోవడం, యోగా అనేవి అలవాటుగా చేసుకోవాలి.

ఆధునిక జీవనశైలి ( Modern Lifestyle ) తీసుకొస్తున్న మార్పులతో చిన్నారులే కాకుండా పెద్దవారిలో కూడా శారీరక శ్రమ లోపిస్తోంది. అధిక క్యాలరీలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య వెంటాడుతోంది. స్వీట్స్ , పానీయాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటివి తీసుకోవాలి. చేపల్లో పుష్కలంగా లభించే ఒమేగా-3 డయాబెటిస్‌కు (Diabetes) మంచి పరిష్కారం. ఆరోగ్యవంతమైన నూనె, పప్పులు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు నిత్యం రెండున్నర గంటలసేపు నడక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజూ సమయానికి భోజనం తప్పనిసరిగా తినాలి. భోజనం విషయంలో సమయం కచ్చితంగా పాటించాలి. చేతికి, కాలికి గాయాలు కాకుండా చూసుకోవాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ధాన్యాలు, పిండిపదార్ధాలు తగ్గించుకోవాలి. పీచుపదార్ధాలు ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారపదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలి. 

Also read: Diabetes and Pregnancy: ప్రెగ్నెన్సీతో ఉన్న వారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News