Hair Transplant Facts: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రాణాలు తీస్తుందా ?

Hair Transplant Facts : జుట్టు లేకపోవడాన్ని ఒక సమస్యగా భావించి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సకు మొగ్గుచూపే వారిని ఒక భయం వెంటాడుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఆ తరువాతి జీవితం ఎలా ఉంటుంది ? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స వికటిస్తే ప్రాణాలు పోతాయా ? అనే భయాలు, సందేహాలు వెంటాడుతుంటాయి.

Written by - Pavan | Last Updated : Dec 9, 2022, 04:10 AM IST
  • ఇంతకీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రాణాంతకమా ?
  • హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అలా చేయకపోతే కష్టమేనా ?
  • లో కాస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌తో వచ్చే ఇబ్బందులు ఏంటి ?
Hair Transplant Facts: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రాణాలు తీస్తుందా ?

Hair Transplant Facts: తలపై జుట్టు లేని వారిలో కొంతమందికి పదిమందిలోకి వెళ్లాలంటే నామూషీగా ఫీల్ అవుతుంటారు. హెయిర్ ఫాలింగ్ కారణంగానో లేక విటమిన్స్ లోపంతోనో జుట్టు ఊడిపోయి బట్టతల రావడం అనేది సహజమే అనే నగ్న సత్యాన్ని అర్థం చేసుకున్న వారు జుట్టు లేకపోవడాన్ని లైట్ తీసుకున్నప్పటికీ.. తల వెంట్రుకలే తమ ఆస్తిపాస్తులు అని భావించే వారికి మాత్రం ఇదో పెద్ద కష్టంగా ఫీల్ అవుతుంటారు. 

ఉదాహరణకు నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన అలా మొదలైంది సినిమాలో హీరో నాని ఎంట్రీ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చికిత్స అనేదే లేని క్యాన్సర్ సోకిన పేషెంట్‌కి, డాక్టర్‌కి మధ్య సంభాషణ జరుగుతున్నట్టుగా సీన్ ప్రారంభించి.. చివరికి ఆ పేషెంట్‌కి ఉన్నది ప్రాణాంతకమైన జబ్బు కాదు.. జుట్టు ఊడిపోవడమే అని చెప్పి నవ్వులు పూయించారు. జుట్టుపై వ్యామోహం ఉండే వారికి జుట్టు ఊడిపోవడం అనేది అంత పెద్ద టెన్షన్ అన్నమాట. అయితే సరిగ్గా అలా జుట్టు ఉంటే చాలు అన్నీ ఉన్నట్టేనని భావించే వారి కోసమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ వచ్చింది. తలపై జుట్టు ఊడిన చోటే మళ్లీ జుట్టును ట్రాన్స్‌ప్లాంట్ చేయడమే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్. అంటే విగ్గుతో మేనేజ్ చేయాల్సిన పని లేకుండా చూడ్డానికి న్యాచురల్ హెయిర్ తరహాలో కనిపించే హెయిర్ అన్నమాట.

ఇంతకీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ప్రాణాంతకమా ?
జుట్టు లేకపోవడాన్ని ఒక సమస్యగా భావించి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సకు మొగ్గుచూపే వారిని ఒక భయం వెంటాడుతోంది. మిగతా అన్ని చికిత్సల తరహాలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోవడం, ఒకింత ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఆ తరువాతి జీవితం ఎలా ఉంటుంది ? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స వికటిస్తే ప్రాణాలు పోతాయా ? అనే భయాలు, సందేహాలు వెంటాడుతుంటాయి. 

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అలా చేయకపోతే కష్టమేనా ?
ఇటీవల ఢిల్లీలో రషీద్ అనే ఒక 30 ఏళ్ల యువకుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స వికటించడంతో చికిత్స తరువాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చి, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు. రషీద్ మరణం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సపై అనేక సవాళ్లను లేవనెత్తింది. అయితే, వాస్తవానికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అనేది సాధారణంగా ప్రాణాంతకం కానప్పటికీ.. ఆ చికిత్సకు అవలంభించే పద్దతులను, చికిత్స విధానాన్ని అనుసరించకపోతే అది ప్రాణాంతకమే అవుతుందంటున్నారు హెయిట్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ ఎక్స్‌పర్ట్స్. ఈ చికిత్సలో వికటించిన వాటికంటే సక్సెస్ రేటు అధికంగా ఉన్నప్పటికీ.. ఎక్కడో ఓ చోట చికిత్సలో జరుగుతున్న తప్పిదాలు పేషెంట్స్ ప్రాణాల మీదకు తీసుకొస్తుండటంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సపైనే అనుమానాలు రేకెత్తించే పరిస్థితికి తీసుకొచ్చిచ్చింది. 

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్, ఫెయిల్యూర్స్ చికిత్సలో భాగంగా ఇచ్చే అనస్థిషియాతో పాటు చికిత్స అందించే వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి. చాలామంది నిపుణులు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం సింగిల్ సిట్టింగ్‌లో 3000 వెంట్రుకలను ఒక నిర్ణీత సమయంలో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఘటనల్లో అంతకు మించి రెండు, మూడు రెట్లు ఎక్కువ ట్రాన్స్‌ప్లాంట్ చేయడమే వారు అనారోగ్యం బారిన పడటానికి ఓ కారణం అవుతోంది. 2019లో ముంబైలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కారణంగా చనిపోయిన 43 ఏళ్ల బిజినెస్‌మేన్ విషయంలో అదే జరిగింది. అతడికి ఒకే సిట్టింగ్‌లో 9 వేల వెంట్రుకలు గ్రాఫ్ట్ చేయడం అనేది అతడి ఆరోగ్య పరిస్థితి విషమించేలా చేసి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఏ చికిత్సకు అయినా.. ఆ చికిత్సను అందించే వారి నైపుణ్యం, చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఆ చికిత్సను విజయవంతం చేయడమో లేక ఫెయిల్ చేయడమో జరుగుతుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా అలాంటిదే. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని చేయకపోతే అది మొదటికే మోసం తీసుకొస్తుందని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. 

లో కాస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆఫర్లు చూసి టెంప్ట్ కావొద్దంటున్న నిపుణులు..
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్‌పై ఇంటర్నెట్‌లో రకరకాల ఆఫర్స్ దర్శనం ఇస్తుంటాయి. ముఖ్యంగా తాము చేసినంత చౌకగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ మరెవ్వరూ చేయరన్న చందంగా లో కాస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ అంటూ అద్దిరిపోయే ఆఫర్స్ ప్రకటిస్తుంటారు. అయితే, అలా చౌకబేరం అన్నిసార్లు సురక్షితం కాదనేది ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. ఎందుకంటే చౌకగా చికిత్సను పూర్తిచేయాలన్న వారి ఉద్దేశం చికిత్స విధానంలో రాజీపడేలా చేస్తుందని.. అదే పేషెంట్స్ కొంపముంచుతుంది అని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే చాలా రకాల చికిత్సలకు ఉన్నట్టుగానే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తరువాత కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంది. దానికితోడు ఇక ట్రీట్మెంట్ విషయంలో కూడా రాజీపడితే అది ఊహించని దుష్ఫలితాలకు దారితీస్తుందనేది వారి ఉద్దేశం.

ఇది కూడా చదవండి : Fatty Liver: డైట్‌లో పొరపాటున కూడా ఈ పదార్ధాలుండకూడదు, లేదంటే ఫ్యాటీ లివర్ సమస్య ముప్పు

ఇది కూడా చదవండి : Refined Oil Side Effects: ఆరోగ్యం కావాలంటే ఈ 6 నూనెలు తక్షణం దూరం పెట్టాల్సిందే

ఇది కూడా చదవండి : Diabetes Diet: ఈ ఆకులతో 7 రోజుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News