Dont eat these after eating Jackfruit: పనస పండు రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఎ, సి, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే పనస పండుతో కొన్ని ఫ్రూట్, వెజిటేబుల్ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందులో బొప్పాయి ఒకటి. పనస పండు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బొప్పాయి పండు తినవద్దు. ఒకవేళ తింటే స్కిన్ అలర్జీతో పాటు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. పనస పండుతో ఇంకా ఏయే కాంబినేషన్స్ తీసుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం...
1) పనస పండు తిన్న తర్వాత పాలు తాగకూడదు :
పనస పండు తిన్న తర్వాత పాలు తాగొద్దు. ఒకవేళ తాగితే పొట్టలో వాపుతో పాటు చర్మంపై దద్దుర్లు వస్తాయి. చాలా మందికి తెల్ల మచ్చలు కూడా రావొచ్చు.
2) పనస పండు తిన్నాక బెండకాయ వద్దు..
పనస పండు తిన్న తర్వాత బెండకాయ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే మీ పాదాల్లో నొప్పి రావొచ్చు. అసిడిటీ సమస్య కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు.
3) పాన్ అస్సలు తినవద్దు :
భోజనం చేసిన తర్వాత పాన్ తినడం చాలా మందికి అలవాటు. అయితే పనస పండు తిని పాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధ్రువీకరించలేదు.)
Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook