Falsa Sharbat Health Benefits: వేసవిలో మార్కెట్లో దొరికే అనేక పండ్లు దొరుకుతాయి. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ దొరుకుతాయి. అయితే ఈ సీజన్‌లోనే ఒక అద్భుతమైన పండు ఒకటి ఉంది. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అదే ఫాల్సా. ఇది ఎక్కువగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలలో ఎక్కువగా లభిస్తుంది. ఇది ఇతర పండ్లతో పోలుస్తే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది. అయితే వేసవికాలంలో శరీరం నుంచి అధిక శాతం చెమట కలగడం వల్ల శరీరంలో ఉండే నీరు కోల్పోతారు. దీని కారణంగా దాహం, అలసట, నీరసం కలుగుతుంది.
ఫాల్సా పండులో అధికశాతం నీరు ఉంటుంది. దీని వల్ల శరీరంలో నీటి కొరత వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండతో తయారు చేసే జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ఫాల్సా దీని గ్రేవియా ఆసియాటికా అని కూడా పిలుస్తారు. ఇందులో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, సి, బి1, బి2,బి3 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ పండు గింజలను తీసుకోవాలి. తరువాత పండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫిల్టర్ సహయంతో నీటిని వేరుచేసుకొని ఐస్, బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. మరింత రుచి కోసం, మీరు ఫాల్సా పండు రసంలో కొంచెం ఏలకుల పొడి లేదా గులాబ్ జల్ కూడా కలుపుకోవచ్చు. ఈ రసాన్ని మరింత చిక్కగా చేయాలనుకుంటే, కొంచెం పెరుగు లేదా తాజా క్రీమ్ కలపండి. ఫాల్సా పండు రసం వేసవిలో చల్లగా ఉండటానికి ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన మార్గం.
ఫాల్సా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
వేసవికాలంలో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎండకాలంలో కలిగే వడదెబ్బ వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కళ్లు తిరగడం, వాంతులు, నీరసం వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. జ్యూస్ తీసుకోవడం ఇష్టంలేనివారు ఈ పండును నేరుగా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ఫాల్సా వల్ల రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం తొలగిపోతుంది. అలసట, బలహీనత, ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇందులో ఉండే సోడియం తలనొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఫాల్సా పండు రసంలో పొటాషియం ఉంటుంది. ఇది డయేరినా సమస్యను తగ్గిస్తుంది. ఇది పిల్లలు , పెద్దలు తీసుకోవచ్చు. ఫాల్సా పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఫాల్సా పండు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి , అంటువ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడానికి సహాయపడతాయి.ఫాల్సా పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మానికి మంచిది. ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫాల్సా పండులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక.
ముఖ్య గమనిక:
ఫాల్సాను ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, రోజుకు ఒకటి లేదా రెండు ఫాల్సాలు మాత్రమే తినాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి