Hyderabad Rains: తెలంగాణ, హైదరాబాద్ సహా గతకొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంటుంది. ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా.. మరోవైపు వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. ఓ వైపు ఎండ కాస్తూనే మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందన్నారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు. మరోవైపు జీహెచ్ఎంసీ, ఈస్ట్, వెస్ట్ , సెంట్రల్ లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు. ఉత్తర అండమాన్ సముద్రం ఎగువ ప్రాంతంలో సైతం ఆవర్తనం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రేపటికి తూర్పు - మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా -పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter