Wine Benefits: మద్యం ఆరోగ్యానికి హానికరమే కానీ..వైన్ మాత్రం గుండెకు మంచిదే

Wine Benefits: మద్యం ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరమే. పొగాకు ఎంత హానికరమో ఇదీ అంతే కానీ వైన్ ఆరోగ్యానికి మంచిదంటే నమ్మగలరా. ఓ రకం వైన్‌పై చేసిన ప్రయోగాలు అదే నిరూపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2022, 08:40 PM IST
Wine Benefits: మద్యం ఆరోగ్యానికి హానికరమే కానీ..వైన్ మాత్రం గుండెకు మంచిదే

Wine Benefits: మద్యం ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరమే. పొగాకు ఎంత హానికరమో ఇదీ అంతే కానీ వైన్ ఆరోగ్యానికి మంచిదంటే నమ్మగలరా. ఓ రకం వైన్‌పై చేసిన ప్రయోగాలు అదే నిరూపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

సాధారణంగా పొగాకు, మద్యం అనేవి ఆరోగ్యానికి ముమ్మాటికీ హాని కల్గించేవే. మద్యం అంటే చాలా రకాలుంటాయి. వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీర్ ఇలా జాబితా పెద్దదే. అన్నింటా ఆల్కహాల్ ఉండేదే. ఆల్కహాల్ ఉన్నదేదైనా ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. ప్రతి వైద్యుడు చెప్పేది కూడా ఇదే. కానీ..వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదని ఇంగ్లండ్ పరిశోధకులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. ఓ రకం వైన్ తాగడం ముఖ్యంగా గుండెకు మంచిదని చెబుతున్నారు. ఇంగ్లండ్ పరిశోధకులు చేసిన రీసెర్చ్ ప్రకారం రెడ్ వైన్ లేదా వైట్ వైన్ గుండెకు మంచిదంటున్నారు. 

ఇంగ్లండ్‌లోని ఏంగ్లియా రస్కిన్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో..వైన్ తాగడం ద్వారా గుండె సంబంధిత రోగాల్నించి తప్పించుకోవచ్చని తేలింది. ద్రాక్షలో ఉండే పోషక పదార్ధాల కారణంగా రెడ్ అండ్ వైట్ ఆర్టరీస్‌కు ప్రయోజనం కలుగుతుందని అధ్యయనంలో తేలింది. అందుకే వైన్ ద్వారా గుండె రోగాల్నించి తప్పించుకోవచ్చంటున్నారు. 

పోలీఫెనోల్స్ అనే పదార్ధాలు ఎక్కువగా కూరగయాలు, ధాన్యాల్లో ఉంటాయనేది పరిశోధకులు చెప్పే మాట. వైన్‌లో పోలీఫెనోల్స్ ఎక్కువ మోతాదులోనే ఉంటుందట. ఈ పోలీఫెనోల్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వాస్తవానికి పోలీఫెనోల్స్ పోషకపదార్ధం. ఎక్కువగా ప్రాకృతికమైన మొక్కల్లో ఉంటుంది. 8 వేలకు పైగా ఉండే పోలీఫెనోల్స్‌లో పండ్లు కూడా ఉన్నాయి. కూరగాయలున్నాయి. 

ఏంగ్లియా విశ్వ విద్యాలయంకు చెందిన డాక్టర్ రూడోల్ఫ్ 4 లక్షల 46 వేలమందిపై పరిశీధనలు చేశారు. ఈ పరిశోధనలో వైన్ తాగేవారితో తాగనివారిని పోల్చి చూశారు. ఆ తరువాత ఫలితాల్ని విశ్లేషించారు. రెడ్ లేదా వైట్‌వైన్ తాగడానికి కొరోనరీ హార్ట్ డిసీజెస్‌కు మధ్య కచ్చితంగా సంబంధముందనేది పరిశోధకుల వాదన. అధ్యయనంలో కూడా రెండు రకాల వైన్‌లు ఈ కోరోనరీ హార్ట్ డిసీజ్‌లో సురక్షితమని తేలింది. అయితే ఇతర రకాల గుండె సంబంధిత వ్యాధుల్లో ఎంతవరకూ మేలు చేకూరుస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. 

అయితే ఇక్కడో విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. వైన్ మంచిదే కానీ ఇంగ్లండ్ పరిశోధకులు చెబుతున్న వైన్ మాత్రం ఆల్కహాల్ లేని వైన్. ఎందుకంటే గుండెకు ఆరోగ్యాన్నిచ్చే పోలిఫెనోల్స్ ఆల్కహాల్ ఫ్రీ వైన్‌లోనే లభ్యమౌతాయి. అందుకే ఆల్కహాల్ ఫ్రీ వైన్స్ సేవించడం ఆరోగ్యానికే కాదు..గుండెకు కూడా మంచిదే.

Also read: Ginger Usage: ఆరోగ్యానికి అల్లం ఎంతవరకూ మంచిది, ఎవరెవరు తినకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News