Spondilitis Signs: ఇటీవలి కాలంలో ముఖ్యంగా పని ఒత్తిడి, గంటల తరబడి కూర్చుని పని చేయడం, మార్కెటింగ్ వృత్తులు ఇలా వివిధ కారణాలతో ఎదురయ్యే అత్యంత బాధాకరమైన సమస్య స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ అనేది ఇటీవలి కాలంలో యువతలో ఎక్కువగా కన్పిస్తోంది.
గత కొద్దికాలంగా దేశంలో స్పాండిలైటిస్ పీడితులు పెరిగిపోతున్నారు. 40 ఏళ్లు దాటినవారే ఎక్కువగా స్పాండిలైటిస్ బారిన పడుతున్నట్టు వివిధ రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. స్పాండిలైటిస్ సమస్య ఉన్నప్పుడు వెన్నుపూస ఎక్కువగా ప్రభావితమౌతుంది. గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేసేవారిలో ఎక్కువగా ఈ వ్యాధి సంభవిస్తోంది. వీపు కింది భాగంలో నడుములో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడం దుర్లభమైపోతుంటుంది. కనీసం కూర్చోలేరు కూడా. ఒక్కోసారి మెడ నుంచి మొదలై భుజాల్లోంచి వస్తూ..అక్కడ్నించి ఎడమ చేతి నరం తీవ్రంగా లాగుతుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది. మెడ, నడుము, స్పైనల్ కార్డు ఇలా ఎక్కడైనా నొప్పి ఉండవచ్చు. వీపు, మెడ, నడుములో నొప్పి ఉంటే కనీసం కూర్చోవడం లేదా నిలుచోవడం కూడా సాధ్యం కాదు.
స్పాండిలైటిస్ సమస్య ఉన్నప్పుడు జీవితం నరకప్రాయంగా మారిపోతుంటుంది. స్పాండిలైటిస్ సమస్య ప్రధానంగా పోశ్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుదంటున్నారు వైద్య నిపుణులు. స్పాండిలైటిస్ వల్ల నిత్య జీవితంలో ప్రతి పని కష్టమైపోతుంది.
స్పాండిలైటిస్ లక్షణాలు
వీపు, మెడ భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కండరాలు తీవ్రంగా లాగుతుంటాయి. భుజాల్నించి గుచ్చేసినట్టుగా ఉంటుంది. భరించడం కష్టమైపోతుంది. కళ్లలో వాపు కన్పిస్తుంది. వినికిడి తగ్గుతుంది. రాత్రి వేళ నొప్పి పెరిగిపోతుంది. ఛాతీలో నొప్పి లేదా ఛాతీలో పట్టేసినట్టు ఉంటుంది. ఒక కాలులేదా రెండు కాళ్లు వేడిగా ఉంటాయి. మెడ లేదా శరీరం ఎగువభాగంలో కదలిక కష్టమైపోతుంది. ఛాతీలో ఒత్తిడిగా ఉంటుంది. హార్ట్ బీట్ వేగమౌతుంది. మెడ పట్టేస్తుంది. తీవ్రమైన అలసట ఉంంటుంది.
స్పాండిలైటిస్ నుంచి ఉపశమనం ఎలా
గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మద్య మధ్యలో లేచి నిలుచోవడం లేదా నడవడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల స్పాండిలైటిస్ నియంత్రణకు దోహదమౌతుంది. వీపు కూడా సెట్ అవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల స్పాండిలైటిస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. స్పాండిలైటిస్ నుంచి ఉపశమనం పొందేందుకు హెల్తీ వెయిట్ కూడా అవసరమే. హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి పోషకాలుండాలి. రోజూ కొద్ది సమయం ఎండలో గడపాలి. ఇలా చేయడం వల్ల స్పాండిలైటిస్ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook