ఆధునిక జీవనశైలి నిత్యజీవితంలో ఎన్నో రకాల వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. జీవనశైలి మార్చుకోకపోతే ప్రాణాంతక జబ్బులు వెంటాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలేంటో తెలుసుకుందాం.
నిత్యజీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు(Health Problems)ఎదురవుతున్నాయి. మధుమేహం, హైపర్ టెన్షన్, కేన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు ప్రధానంగా మారాయి. మరీ ముఖ్యమంగా మానసిక రుగ్మతలు ఎక్కువవుతున్నాయి. ఈ అన్నింటికీ కారణం ఆధునిక జీవనశైలే. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో అధికంగా నమోదవుతున్నాయి. ఓ వైపు మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్నా కేసులు మాత్రం యదేఛ్చగా పెరుగుతున్నాయి. ఆందోళన కల్గిస్తున్నాయి. ఏపీలో గత 5 నెలల్లో 1.30 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లు కేవలం ఆదునిక జీవనశైలి రుగ్మతలతో(LIfestyle Diseases) బాధపడుతున్నారని తేలింది. 2021 నుంచి వివిధ రకాల ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల్ని బట్టి ఈ గణాంకాలు తెలుస్తున్నాయి.
అన్ని సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి(Depression) మాత్రమేనని తెలుస్తోంది. ఉద్యోగాలు, చదువుల్లో ఉన్నవారు ఎక్కువగా సమస్యలకు లోనవుతన్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ అత్యధికగా 51 వేలమంది మానసిక జబ్బులతో బాధపడుతున్నారని వెల్లడైంది. మరోవైపు కోవిడ్ కూడా ఒత్తిడికి అదనంగా కారణమైందనేది నిపుణులు చెబుతున్న మాట. ప్రధానంగా గుండె జబ్బులు మధుమేహం(Diabetes), హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల నియంత్రణ అనేది మనచేతుల్లోనే ఉందని వైద్యులంటున్నారు. దైనందిక కార్యక్రమాల్ని బట్టే ఇవి వస్తున్నాయని తేలింది. సరైన వ్యాయామం లేకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేక..35 ఏళ్లలోపు యువకులు సైతం హార్ట్ స్ట్రోక్స్‌కు గురవుతున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో డయాబెటిక్ కేసులు ఆహారపు అలవాట్ల కారణంగా పెరుగుతున్నాయని అర్ధమవుతోంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా వ్యాధులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధుమేహం, గుండెపోటు జబ్బుల్ని ప్రాథమిక దశలోనే కనుగొనేందుక వీలుగా ప్రత్యేక నిపుణుల్ని నియమిస్తోంది. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేస్తూ అవగాహన కల్పించేదుకు ప్రయత్నిస్తోంది. నగరీకరణ నేపధ్యంలో వస్తున్న ప్రతికూల మార్పులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపించడం అన్నింటికీ మూలకారణంగా ఉందనేది వైద్య నిపుణుల సూచన. అందుకే ఆహారపు అలవాట్లను ముఖ్యంగా జీవనశైలిని(Lifestyle) మార్చుకోమని సలహా ఇస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు వ్యాయమం అలవాటు చేసుకోవాలంటున్నారు.
Also read: ఒమిక్రాన్ కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికా పర్యటనపై నీలినీడలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook