రోజురోజుకూ లైఫ్‌స్టైల్ మారిపోతోంది. పోటీ ప్రపంచంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో ముఖ్యమైంది మజిల్ క్రాంప్స్. తొడల్లో, మోకాలి కిందిభాగంలో విపరీతమైన భరించలేని నొప్పి.
ఆహారపు అలవాట్లు, నిద్ర, జీవనశైలి బాగుంటే..ఏ విధమైన అనారోగ్యం ఉండదు. ఇవి సరిగ్గా లేకనే..వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా కన్పించేది ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పిస్తున్నది మజిల్ క్రాంప్స్. తరచూ పిక్కలు, తొడ కండరాలు, ఛాతీ కండరాలు బిగుసుకుపోతుంటాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. తొడలు, పిక్కల్లో అయితే భరించలేని నొప్పే ఉంటుంది. దీనినే మజిల్ క్రాంప్స్‌గా పరిగణిస్తుంటారు.
ఈ సమస్య ముఖ్యంగా టీనేజ్ యువతలో ఎక్కువగా కన్పిస్తోంది. తొడ, పిక్కల్లో విపరీతమైన, భరించలేని నొప్పి ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి. ఇందులో ప్రధానంగా నిద్ర సరిగ్గా లేకపోవడం, ఆహారంలో పోషక పదార్ధాలు లోపించడం, శరీరానికి అవసరమైన లవణాలు, ద్రవాలు తీసుకోకపోవడం, అలసట కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, ఫాస్పేట్ పరిమాణం, కాల్షియం తగ్గితే మజిల్ క్రాంప్స్ వస్తుంటుంది.
మజిల్ క్రాంప్స్ నుంచి ఎలా ఉపశమనం
నిత్య జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. ఈ సమస్య నుంచి చాలా సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనికోసం రోజూ క్రమం తప్పకుండా కాస్త ఉప్పు కలుపుకుని మజ్జిగ తీసుకోవాలి. వేసవిలో అయితే క్రమం తప్పకుండా బార్లీ తాగాలి. రోజుకు 7-8 గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాలి. అదే విధంగా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 7-8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి.
Also read: Lungs Cancer Symptoms: లంగ్ కేన్సర్ లక్షణాలేంటి, ఎలా గుర్తించవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook