Winter Eye Care Tips: చలికాలంలో పొడి గాలి, మంచు, యూవీ రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీని కారణంగా చాలా మంది కంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అంతేకాకుండా మొబైల్, లాప్ టాప్స్ ఎక్కువసేపు చూడటం కారణంగా కూడా కంటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయని కంటి వైద్యులు చెబుతున్నారు. శీతాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇక్కడ చెప్పిన చిట్కాలు ఫాలో అవ్వండి
1. సన్ ప్రొటెక్షన్: వేసవికాలంలోనే కాకుండా చలికాలంలో కూడా తప్పకుండా సన్ ప్రొటెక్షన్ ఉపయోగించాలని కంటి వైద్యలు సూచిస్తున్నారు. దీని కారణంగా ఆకాశంలో మేఘాలు కమ్ము కొనేటప్పటికి సూర్యకిరణాలు, యూవీ రేడియేషన్ ప్రభావం ఉంటుంది తెలుస్తోంది.
2. చేతులను శుభ్రంగా ఉంచుకోండి: చేతులపై ఎక్కువ శాతం బ్యాక్టీరియా ఉంటుంది. తరచుగా చేతులను కళ్ల మీద పెట్టడంతో బ్యాక్టీరియా వ్యాప్తిస్తుంది. కాబట్టి మీ చేతులను శుభ్రంగా ఎల్లప్పుడు కడుక్కోండి.
3. మేకప్ ప్రొడక్ట్స్: ముఖ్యంగా ఆడవారు ఐ మేకప్ విషయంలో చాలా జాగ్రతగా ఉండాలి. ముందుగా కంటిరెప్పలను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల మేకప్ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
4. కాంటాక్ట్ లెన్స్‌తో జాగ్రత్త: చలికాలంలో కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్న వారు కళ్ళు తేమగా ఉన్నప్పుడే వియోగించాలి. ఇలా చేయడం వల్ల కాంటాక్ట్ లెన్స్‌లను పెట్టుకున్నాడు అసౌకర్యం ఉండదు.
5. కంటి అలర్జీ: కళ్ళు ఎర్రగా, నీళ్లవచ్చేలా, దురద వంటి సమస్యలు శీతాకాలంలో తరచుగా వస్తుంటాయి. ఇలాంటి అలర్జీలకు దూరంగా ఉండాలి అంటే కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి