Neem Benefits: ప్రకృతిలోని బెస్ట్ యాంటీ బయోటిక్, బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటో తెలుసా

Neem Benefits: భారతీయులకు ప్రత్యేకమైన చెట్టు వేప. సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా..బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఇంకా ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. వేపతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2022, 02:54 PM IST
  • ప్రకృతిలో లభించే సహజసిద్ద యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ మందుగా వేపకు గుర్తింపు
  • సనాతన భారతీయ ఆయుర్వేద వైద్యంలో వేప ప్రయోజనాలపై విస్తృత సమాచారం
  • ఏజీయింగ్ సమస్యకు వేపతో పరిష్కారం
 Neem Benefits: ప్రకృతిలోని బెస్ట్ యాంటీ బయోటిక్, బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటో తెలుసా

Neem Benefits: భారతీయులకు ప్రత్యేకమైన చెట్టు వేప. సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా..బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఇంకా ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. వేపతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చేదుగా ఉన్నా అద్భుతమైన ఔషధం. వేప గురించి భారతీయ సనాతన వైద్యంలో ఉన్నంత విస్తృతమైన సమాచారం మరెక్కడా లేదంటే అతిశయోక్తి కానేకాదు. వేపను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా భారతదేశమే. భారతదేశంలోని సనాతన ఆయుర్వేద శాస్త్రంలో వివరించిన వేప లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ప్రకృతిలో సహజసిద్దమైన బెస్ట్ యాంటీ బయోటిక్‌గా , అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కగా వేపకు పేరుంది. వేప అనేది భారతీయలకు ప్రత్యేకం.

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్‌గా వేప

వేపలో చాలా రకాల సమ్మేళనాలున్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా అధికం. రుచిలో చేదుగా ఉన్నా..ఆరోగ్యపరంగా చాలా మంచిది. వేప ఆకులతో అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, మెదడు సంబంధిత సమస్యలు, చర్మవ్యాధులు, జుట్టు సమస్య, కాలేయం, మూత్రపిండాల సమస్య నివారణ సాధ్యమవుతుంది. మలేరియా తీవ్రత పెరగకుండా చేయడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మలేరియాను నియంత్రిస్తాయి.

ఇక కామెర్లు వ్యాధికి వేపను మించిన ఔషధం లేదనే చెప్పాలంటున్నారు వైద్య నిపుణులు. వేపరసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే..కామెర్ల నుంచి రక్షించుకోవచ్చు. వేపరసం కొద్దిగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. 

వేపలో యాంటీ వైరల్ గుణాలు

వేపరసం యాంటీ వైరల్‌లా పనిచేస్తుండటంతో..వైరల్ ఫీవర్లు తగ్గుతాయి. కార్డియో వాస్కులర్ సమస్యలు దూరమౌతాయి. వేపరసంతో మధుమేహం వ్యాధి రాకుండా నివారించవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను వేపరసం బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా..రోగ నిరోధక శక్తిని పెంచడంతో దోహదపడుతుంది. 

గర్భిణీ స్త్రీలు వేపనీరు తీసుకుంటే..యోనిలో నొప్పి సమస్యలు దూరమౌతాయి. డెలివరీ తరువాత కొన్నిరోజులపాటు వేప నీరు తాగడం అలవాటు చేసుకుంటే..చాలా రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి విముక్తి పొందవచ్చు. దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం రావడాన్ని నిరోధిస్తుంది. దీనికోసం వేప బెరడు లేదా కొమ్మ లేదా ఆకుల్ని నీటిలో బాగా ఉడకబెట్టి.. అదే నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి. 

Also read: High Cholesterol: ఈ 4 లక్షణాలు కొలెస్ట్రాల్ పెరిగుదలను సూచిస్తాయి..ఇవి పెరిగితే గుండెపోటు తప్పదు.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News