Health Tips: ఒక్క ఫ్రూట్ చాలు, శరీరానికి కావల్సిన అన్ని పోషకాలకు గ్యారంటీ

Health Tips: ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు నిజంగానే అమృతంతో సమానం. అంతటి అద్భుతమైన పోషకాలుంటాయి. అలాంటిదే అమర ఫలం. అమరఫలంతో కలిగే ప్రయోజనాలు చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2022, 09:45 PM IST
Health Tips: ఒక్క ఫ్రూట్ చాలు, శరీరానికి కావల్సిన అన్ని పోషకాలకు గ్యారంటీ

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరానికి మేలు చేకూర్చడమే కాకుండా..అద్భుతమైన శక్తిని కూడా ఇస్తాయి. అలాంటి పండ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది అమరఫలం. అన్ని విటమిన్లు అందించే ఫ్రూట్ ఇది. 

అమరఫలం..ఇటీవలి కాలంలో ఇండియాలో ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో విటమిన్లు, న్యూట్రిషన్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి6, ఫోలెట్, పొటాషియం, కాపర్ వంటి పోషక పదార్ధాలు అద్భుతంగా ఉంటాయి. అమరఫలంలో ఇన్ని అద్భుత గుణాలున్నాయి కాబట్టే..ఇటీవల ఇండియాలో ఈ ఫ్రూట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇంగ్లీష్లులో Persimmonగా పిలుస్తారు. ఇది చైనా దేశపు ఫ్రూట్. ఈ ఫ్రూట్‌తో కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.

కంటి వెలుగు కోసం..

అమరఫలం అనేది విటమిన్లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి వెలుగును పెంచుతుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి6, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. ఫలితంగా పలు వ్యాధుల్నించి రక్షణ కలుగుతుంది. 

గుండె ఆరోగ్యానికి..

అమరఫలం గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్, క్వెర్సెటిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఫ్రూట్ రోజూ తింటే గుండె సంబంధిత రోగాల ముప్పు తగ్గుతుంది. 

అధిక బరువుకు చెక్

స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. బరువు తగ్గేందుకు ఈ ఫ్రూట్ దోహదపడుతుంది. ఇది తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. 

Also read: Cancer Vaccine: కేన్సర్‌పై బిగ్ అలర్ట్, 2031 నాటికి కేన్సర్ వ్యాక్సిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News