Pfizer Medicine on Omicron: ఒమిక్రాన్ ప్రపంచమంతా విస్తరిస్తూ ఆందోళన రేపుతున్న తరుణంలో ఫైజర్ కంపెనీ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. కోవిడ్ చికిత్సకై తయారు చేసిన ఆ మందు ఒమిక్రాన్‌పై సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. యూకేలో పరిస్తితి విషమంగా మారుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 77 దేశాలకు వ్యాపించింది. డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తూ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో చాలా దేశాలు ఇప్పటికే ప్రయాణ ఆంక్షలు విధించాయి. కరోనా వైరస్‌లోని గతంలో ఉన్న వెర్షన్లతో పోలిస్తే ఒమిక్రాన్ సంక్రమణ వేగం ఎక్కువ. అయితే ఇన్‌ఫెక్షన్ తీవ్రత తక్కువేనని దక్షిణాఫ్రికాలో జరిపిన అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). ప్రపంచంలో యూకే, డెన్మార్క్, దక్షిణాఫ్రికాలో అత్యధిక కేసులున్నాయి.
ఈ నేపధ్యం ప్రముఖ అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్(Pfizer)నుంచి శుభవార్త వస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై తాము రూపొందించిన యాంటీ వైరల్ ట్యాబ్లెట్ సమర్ధవంతంగా పనిచేస్తోందని ఫైజర్ వెల్లడించింది. ఇప్పటికే ఈ మందును 2 వేల 250 మందిపై ప్రయోగించి..అధ్యయనం చేయగా సానుకూల ఫలితాలు వచ్చినట్టు ఫైజర్ వివరించింది. వైరస్ ముప్పు ఎక్కువగా ఉండి లక్షణాలు కన్పిస్తే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలని అదుపులో వస్తోందని ఫైజర్ తెలిపింది. అటు మరణాల రేటు కూడా 89 శాతం తగ్గిపోయిందంటోంది. ఫైజర్ ట్యాబ్లెట్(Pfizer New Medicine on Omicron) తీసుకున్నవారిలో వైరస్ స్థాయి 10 రెట్లు తగ్గినట్టు తేలిందని ఫైజర్ స్పష్టం చేసింది. ల్యాబ్‌లో నిర్వహించిన మరో పరీక్షలో కూడా ఒమిక్రాన్ వేరియంట్‌పై(Omicron Variant) సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ఫైజర్ పరిశోధకులు తెలిపారు.
ఎలా తయారు చేశారు
వాస్తవానికి ఈ ట్యాబ్లెట్‌ను ఫైజర్ కంపెనీ వివిధ రకాల పరిశోధనల్లో, అధ్యయనాల్లో వెలువడిన ఫలితాల ఆధారంగా ఓ ప్రయోగం చేసి సాధించింది. పునరుత్పత్తి కోసం ఒమిక్రాన్ వేరియంట్‌లోని కీలక ప్రొటీన్‌ను కృత్రిమంగా తయారు చేసి ఈ ట్యాబ్లెట్‌ను(Pfizer Medicine on Omicron) ప్రయోగించగా..మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత మరో 2 వేల 250 మందిపై ప్రయోగించగా అనుకూలమైన ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా ఈ మందును అమెరికా ఆహార, ఔషధ నియంత్ర సంస్థ ఆమోదించాల్సి ఉంది.
Also read: Weight Loss Breakfast: బెల్లీ ఫాట్ తగ్గించుకునేందుకు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ మెను!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook