Phool Makhana Recipe For Weight Loss: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా యువతను అయితే ఎంతో ప్రమాదకరమైన గుండె జబ్బులను ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది అయితే మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల వారిని కూడా పడుతున్నారు. అయితే ఇవన్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణం శరీర బరువు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దినచర్యలో భాగంగా తప్పకుండా శరీర బరువును కూడా నియంత్రించుకోవడం ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు.
బరువు పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ముఖ్యంగా చాలామందిలో దీని కారణంగానే అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయని ఇటీవలే కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి శరీర బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే తీసుకునే ఆహారాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఆధునిక జీవన శైలికి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి చాలామంది ఆరోగ్య నిపుణులు వివిధ డైట్లను సూచిస్తున్నారు. ఈ డైట్ లో భాగంగా ఫూల్ మఖానా తో తయారు చేసిన ఈ కింది రెసిపీని తీసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
మసాలా రోస్టెడ్ ఫూల్ మఖానా:
కావలసిన పదార్థాలు:
✾ఫూల్ మసాలా - 2 కప్పులు
✾ నెయ్యి - 2 tsp
✾ మిరియ పొడి - 1/2 tsp
✾ జీలకర్ర పొడి - 1/2 tsp
✾ కారంపొడి - 1/2 tsp
✾ కరివేపాకు - రెండు రెమ్మలు
✾ రుచికి తగినంత ఉప్పు
తయారుచేసే విధానం:
✾ ముందుగా స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టుకోవాలి. అందులో ఫూల్ మఖానాలను 10 నిమిషాలు రోస్టెడ్ చేయాల్సి ఉంటుంది.
✾ ఇలా రోస్ట్ చేసిన ఫూల్ మఖానా క్రిస్పీగా బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది.
✾ అదే పాన్‌లో నెయ్యి వేసి రెండు నిమిషాల పాటు బాగా వేడి చేయాల్సి ఉంటుంది ఇలా వేడి చేసిన నెయ్యిలో జీలకర్ర పొడి కారంపొడి వేసి 30 సెకండ్ల పాటు వేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే వేయించుకొని పక్కన పెట్టుకున్న ఫూల్ మఖానాను వేసి బాగా వేయించుకోవాలి.
✾ ఇలా 5 నిమిషాల పాటు వేయించుకున్న ఫూల్ మఖానాపై ఉప్పు చెల్లి డబ్బాలో నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా శరీర బరువును తగ్గించే ఫూల్ మఖానా రెసిపీ తయారైనట్లే.
బరువు తగ్గాలనుకునేవారు ఇలా తయారు ఫూల్ మఖానాను ప్రతిరోజు సాయంత్రం పూట స్నాక్స్ గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా ఈ రెసిపీ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి