Promogran Fruit Juice Benefits: శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు పండ్లను తీసుకుంటూ ఉంటారు. అన్ని సీజన్ లలో పండ్లను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా యాపిల్ పనులతో పాటు దానిమ్మ పండ్లను తీసుకుంటున్నారు. ఈ రెండింటిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ప్రతిరోజు దానిమ్మ రసం తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ పండ్లలో శరీరానికి కావాల్సిన విటమిన్ సి తో పాటు డి, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ పండుతో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల వృద్ధాప్య చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయి. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి దానిమ్మ పండ్లతో తయారుచేసిన రసం ప్రభావవంతంగా సహాయపడుతుంది.
ఈ పండు రసంలో మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి నరాల సమస్యలు, చాలా సమస్యలను ప్రభావంతంగా దూరం చేస్తుంది. అంతేకాకుండా నరాలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రసాన్ని రక్తహీనత సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఒక గ్లాసు దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని.. అంతేకాకుండా మెదడు పనితనాన్ని చురుకుగా చేసేందుకు కూడా ఈ రసం ప్రభావంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి..అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.