Prostate Cancer Symptoms: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలా..?

Prostate Cancer Symptoms: అసలు ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి.. ఎలా వస్తుంది... దీనికి చికిత్స అందుబాటులో ఉందా.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 8, 2022, 04:11 PM IST
  • అసలు ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి
  • ఎలా వస్తుంది... దీనికి చికిత్స అందుబాటులో ఉందా..
  • పూర్తి వివరాలివే..
 Prostate Cancer Symptoms: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలా..?

Prostate Cancer Symptoms:  ప్రస్తుత కాలంలో చాలామంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం 65 ఏళ్లు పైబడినవారిలో ఈ సమస్య అధికంగా ఉంది. ప్రొస్టేట్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ (49.2 శాతం),  గాల్ బ్లాడర్ క్యాన్సర్ (45.7 శాతం) పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడే ప్రతీ 41 మందిలో ఒకరికి మరణం సంభవిస్తోంది. ఈ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో బయటకపోవడం, త్వరగా దీన్ని గుర్తించలేని కారణంగా వ్యాధి తీవ్రత పెరిగి మరణానికి దారితీస్తోంది. ప్రతీ ఏటా సెప్టెంబర్‌‌ను ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి.. దాని లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఎలా ఉంటుంది తదితర వివరాలు తెలుసుకుందాం... 

ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి :

ప్రొస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌నే ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ గ్రంథి వాల్‌నట్ పరిమాణంలో కటి భాగంలోని బ్లాడర్‌కి పక్కనే ఉంటుంది. ఇది వీర్యపు స్రావాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువే అయినప్పటికీ.. ప్రారంభ దశలో బయటపడే కేసులు చాలా తక్కువ. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశ దాటిందంటే.. అది ఎముకలు, ఇతర అవయవాలకు కూడా విస్తరిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే మరణం సంభవిస్తుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు :

మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా వీర్య స్కలనం జరిగేటప్పుడు నొప్పిగా లేదా మంటగా అనిపిస్తుంది.
రాత్రిపూట మూత్ర విసర్జన ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు మూత్రాశయం నిండినా మూత్రాన్ని బయటకు విసర్జించలేకపోతారు.
కటి భాగంలో వాపు, ఎముకల్లో నొప్పి, ఫ్రాక్చర్స్, స్వల్ప గాయాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
మూత్రం లేదా వీర్యంలో రక్తం రావొచ్చు.
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి 

ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (PSA) బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (డీఆర్ఈ) ద్వారా కూడా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. ట్రాన్స్‌రెక్టల్ బయోప్సీ కూడా ఇందుకు దోహదపడుతుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ ఎవరికి, ఎలా వస్తుంది :

ప్రొస్టేట్ క్యాన్సర్ ఎలా వస్తుందనే దానికి కచ్చితమైన కారణాలేవీ లేవు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే  కుటుంబంలో ప్రొస్టేట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే వ్యాధిని నియంత్రించవచ్చు.

ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్స :

ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. క్యాన్సర్ టైప్, స్టేజ్‌, పేషెంట్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, సైడ్ ఎఫెక్ట్స్‌ను బట్టి ట్రీట్‌మెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలు, ఎముకలకు విస్తరించకముందే గుర్తించగలిగినట్లయితే వ్యాధిని నియంత్రించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి ముదిరితే హార్మోన్ థెరపీ, రేడియో థెరపీ, కీమోథెరపీ అవసరమవుతాయి. 

Also Read: Divya Vani to Join BJP: బీజేపీలోకి దివ్యవాణి.. అంతా సిద్ధమే కానీ?

Also Read: లైవ్ మ్యాచ్‌లోనే.. అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ను కొట్టబోయిన పాకిస్తాన్ బ్యాటర్! (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News