Samai Rice For Weight Loss In 7 Days: శరన్నవరాత్రులు భారతదేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో భక్తులంతా అమ్మవారికి పూజలు చేసి భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. అమ్మవారి పూజలో భాగంగా బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పిస్తారు. ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ నైవేద్యంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ పాయసంలో వినియోగించే బియ్యంలో విటమిన్, ఫైబర్, కాల్షియం అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ పాయసాన్ని క్రమం తప్పకుండా కూడా తినొచ్చా. ఈ పాయసాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
ఈ పాయసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
దృఢంగా చేస్తాయి:
ఎముకల అభివృద్ధికి, బలాన్ని ఇచ్చేందుకు ఈ పాయసంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ ఆహారాలను తీకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల సమస్యలు దూరమవుతాయి.
బరువును నియంత్రిస్తుంది:
ఈ పాయసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ఆకలిని నియంత్రించి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గింస్తుంది. అయితే దీనిని మధుమేహం ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వీటిలో రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా మారుతుంది.
ఐరన్ లోపాన్ని నియంత్రిస్తుంది:
ఉపవాసం క్రమంలో ఈ పాయాసాలను ఆహారంగా తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు ఉన్నవారు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిలో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి ఈ పాయసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook