Saturn Rise 2023: మార్చ్ 5 నుంచి ఆ 4 రాశులకు కష్టాలు ప్రారంభం, తస్మాత్ జాగ్రత్త

Saturn Rise 2023: గ్రహాల గోచారం అంటే రాశి పరివర్తనంతో పాటు వివిధ గ్రహాల అస్తమయం, ఉదయం కూడా వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు శని గ్రహం ఉదయించనుండటం కొన్ని రాశులకు తీవ్రంగా మారనుంది. కొద్ది రోజులపాటు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 24, 2023, 08:52 AM IST
Saturn Rise 2023: మార్చ్ 5 నుంచి ఆ 4 రాశులకు కష్టాలు ప్రారంభం, తస్మాత్ జాగ్రత్త

హిందూమతంలోని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. శని గ్రహం మార్చ్ 5వ తేదీన కుంభరాశిలో ఉదయించనుండటం వల్ల ముఖ్యంగా నాలుగు రాశులకు తీవ్రంగా ఉండనుంది. అంటే ఈ నాలుగు రాశుల జాతకంవారికి మార్చ్ 5వ తేదీ నుంచి కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఏయే రాశులకు క్లిష్ట సమయమో తెలుసుకుందాం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జనవరి 30, 2023 నుంచి అస్తమించి ఉన్న శనిగ్రహం మార్చ్ 5న కుంభరాశిలో ఉదయించనున్నాడు. శని తిరిగి ఉదయించడం కొన్ని రాశులకు కష్టంగా మారనుంది. తీవ్రమైన నష్టాలు ఎదురౌతాయి. అదే సమయంలో బుధుడు కూడా ఫిబ్రవరి 28వ తేదీన కుంభరాశిలోనే అస్తమించనున్నాడు. అంటే శని రాశిలో శని ఉదయించడం, బుధుడు అస్తమించడం వల్ల మొత్తం 12 రాశులపై, వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా కన్యా, వృశ్చిక, మకర, మీన రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. 

కన్యా రాశి

శని గ్రహం కుంభరాశిలో ఉదయించడం వల్ల కన్యారాశి జీవితంలో ఎగుడు దిగుడు కన్పిస్తుంది. సహచరుల కారణంగా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని నిగ్రహించుకోకపోతే అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యక్తిగత జీవితం, పని వ్యవహారాల్లో బ్యాలెన్స్‌గా ఉండకపోతే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. 

వృశ్చిక రాశి

శని గ్రహం ఉదయించడం వృశ్చిక రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. అంటే కాస్త అనుకూలంగా, కాస్త ప్రతికూలంగా ఉండవచ్చు. కావల్సినవారితో వివాదం ఏర్పడుతుంది. అదృష్టం తోడివ్వనందున జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట సమస్యలు ఉత్పన్నం కావచ్చు. సోదరులతో , బంధువులతో వివాదం రావచ్చు. జీవిత భాగస్వామితో ఘర్షణ మంచిది కాదు. లేకపోతే వ్యవహారం చెడిపోవచ్చు.

మకర రాశి

కుంభరాశిలో శనిగ్రహం ఉదయించడం వల్ల మకర రాశి వారికి మరిన్ని కష్టాలు పెరుగుతాయి. వృత్తిపరంగా సమస్యలు ఎదురుకావచ్చు. పనిలో, ఇతర వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఆస్థి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 

మీనరాశి

శని గ్రహం ఉదయించడం వల్ల మీనరాశి వారికి మంచిది కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఈ జాతకం వారికి ప్రేమ, వైవాహిక జీవితంలో పొరపొచ్ఛాలు పెరగవచ్చు. పరస్పరం మాట్లాడుకుని ఈ సమస్య నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి సమస్యలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులుంటాయి.

Also read: Mercury transit in Aquarius: బుధ గోచారం ప్రభావం, ఫిబ్రవరి 27 నుంచి ఈ 5 రాశులపై కనకవర్షమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News