Beauty Tips: అందం కోసం రోజు వాడే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత ప్రమాదకరమో తెలుసా..?

Eye Health: ఐ-లైనర్ నుంచి మస్కార వరకు.. లిప్స్టిక్ నుంచి కాంపాక్ట్ వరకు.. కంప్లీట్ గా సెట్ అయితే తప్ప అమ్మాయిలు ఈరోజుల్లో అడుగు బయట పెట్టడం లేదు. అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో విపరీతంగా వాడే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో మీకు తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 08:00 PM IST
Beauty Tips: అందం కోసం రోజు వాడే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎంత ప్రమాదకరమో తెలుసా..?

Eye Makeup: అందం అనేది అరువు తెచ్చుకుంటే రాదు. అది మన అంతర్గతంగా ఉండాలి. ఒకప్పుడు మంచి ఆహారం ద్వారా సరియైన ,రెస్ట్ ద్వారా అందాన్ని పెంపొందించాలి అని పెద్దలు చెప్పేవారు. అయితే ప్రస్తుతం యువత మేకప్ వేసుకుంటే చాలు అందంగా ఉంటాము అని భావిస్తున్నారు. అందుకోసం వారు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ కారణంగా కొంతమంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ నిజానికి వాళ్ళ పరిస్థితికి కారణం ప్రమాదకరమైన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మరి మనం రోజు వాడే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో మనకు ఎక్కువ హాని కలిగించేవి ఏవో తెలుసుకుందాం పదండి..

మనిషి అందానికి కవులు ఎక్కువగా వర్ణించేది కళ్ళు. అందుకే నేటి తరం యువత కంటి మేకప్ మీద ఎంతో దృష్టి పెడతారు. కళ్ళు అందంగా పెద్దవిగా కనిపించాలని పలు రకాల ప్రొడక్ట్స్ వాడుతారు .ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉపయోగించే కొన్ని రసాయనాల కారణంగా కంటిచూపు దెబ్బతినడంతో పాటు పలు రకాల ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశం ఉంది.

మనం ఉపయోగించే పలు రకాల ఐ మేకప్ ఉత్పత్తుల లో ఫైన్ పౌడర్ zగ్లిట్టర్ లాంటి పదార్థాలు ఇవి మన కనురెప్ప మీద గ్రంధులను మూసివేసి ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయి. ఈ మేకప్ ఉత్పత్తుల కారణంగా కంటి పై హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల కంటి ఉపరితలంపై పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో ఇది తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ కి కూడా దారితీస్తుంది.

ఐలేషస్ పొడుగుగా అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువగా మస్కారా వంటివి వాడుతారు. అయితే వీటివల్ల వెంట్రుకలు జోడించబడడంతో పాటు చర్మం దగ్గర ఇరిటేషన్ కూడా కలుగుతుంది. పైగా మస్కార వాడిన తరువాత సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ప్రస్తుతం చాలామంది అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో కాంటాక్ట్ లెన్సెస్ ఎక్కువగా వాడుతున్నారు. అవి సరిగ్గా శుభ్రం చేయనట్లయితే కంటి లోపల ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా దృష్టి పోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. అందుకే మీరు వాడే లెన్స్ లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి మూడు నెలలకు కాంటాక్ట్ లెన్సెస్ మారుస్తూ ఉండాలి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒక్కసారి డాక్టర్ ను సంప్రదించండి. 

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News