Spinach: పాలకూర అతిగా తింటే ప్రమాదకరమా, కారణమేంటి

Spinach: మెరుగైన ఆరోగ్యం కోసం సాధ్యమైనంతవరకూ ఆకు కూరలు ఎక్కువగా తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఆకుకూరల పేరు చెప్పగానే ప్రధానంగా విన్పించేది పాలకూర. అయితే పాలకూర మోతాదుకు మించితే దుష్ప్రయోజనాలున్నాయా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2023, 05:12 PM IST
Spinach: పాలకూర అతిగా తింటే ప్రమాదకరమా, కారణమేంటి

Spinach: పాలకూరను సాధారణంగా పోషకాలు అత్యధికంగా ఉండే ఆకుకూరగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే ఇందులో ఉండే ఆక్సలేట్ కారణంగా అదే ఆరోగ్యం వికటించవచ్చు. అయితే పాలకూర తినకూడదా..ఏం చేయాలి మరి..ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.

పాలకూరను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పోషకాలు అమితంగా ఉంటాయి. విటమిన్ సి, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరం ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ కొరత ఏర్పడదు. ఎముకలు పటిష్టంగా మారతాయి. ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు పాలకూరను ఎందుకు తినకూడదంటున్నారు. పాలకూర ఆరోగ్యానికి ఎంత మంచిదైనా, పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్నా సరే..ఇందులో ఉండే ఆక్సలేట్ అనేది ఎక్కువైతే ప్రమాదకరం కావచ్చు.

పాలకూరలో విటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువైతే శరీరంపై మందుల పనితీరును తగ్గిస్తుంది. ప్రత్యేకించి గుండెపోటు రోగులకు ఇచ్చే బ్లడ్ థిన్నర్ మందుల ప్రభావాన్ని తగ్గించేస్తుంది. దాంతో ప్రమాదం కావచ్చు. అందుకే పాలకూర ఎక్కువగా తినకూడదు. 

కిడ్నీలో రాళ్లు సమస్య ఉన్నవాళ్లు పాలకూర ఎక్కువగా తింటే మంచిది కాదు. ఇందులో ఉండే ఆక్సలేట్ కారణంగా కిడ్నీలో రాళ్లు సమస్య ఉత్పన్నం కావచ్చు. ఫలితంగా యూరిన్ ద్వారా విసర్జితమయ్యే ఆక్సలేట్ రాళ్లుగా మారవచ్చు.

ఆక్సలేట్ ఎక్కువైతే శరీరానికి నష్టమే కలుగుతుంది. అందుకే పాలకూరను ఎక్కువగా తినకూడదంటారు. ఇందులో ఉండే ఆక్సలేట్ కారణంగా రక్తం పల్చగా మారుతుంది. ఫలితంగా అలసట, బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

పాలకూరను పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఆక్సలేట్ సమృద్ధిగా శరీరంలో చేరుతుంది. అంటే ఇది మరీ ప్రమాదకరం. అందుకే పాలకూరను కూర రూపంలో లేదా ఫ్రై రూపంలో తీసుకుంటే కాస్త మంచిది. అది కాకుండా పాలకూరతో పన్నీర్, లేదా పప్పు కాంబినేషన్‌లో కూడా వండుకుని తినవచ్చు. దీనివల్ల ఆక్సలేట్ ప్రభావం సాధ్యమైనంతవరకూ తగ్గించవచ్చు.

Also read: Best Breakfast Foods: మీ శరీరంలో ఇమ్యూనిటీని వేగంగా పెంచే 6 అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News