Sweet Potatoes For Diabetics: తీవ్ర మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా వారి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారు ఏదైనా వస్తువులను ఎక్కువగా తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగే అవకాశాలుంటాయి. అంతేకాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమందిలో ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి.
అయితే చాలామంది మధుమేహంతో బాధపడేవారు తరచుగా బంగాళదుంప తింటూ ఉంటారు. కొంతమంది బంగాళదుంపను ప్రతి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ ఉంటాయని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంతకీ క్రమం తప్పకుండా బంగాళదుంప తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..? ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం ఉన్నవారు బంగాళదుంప తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళదుంపలు అధిక పరిమాణంలో ఫైబర్ తో పాటు పోషకాలు లభిస్తాయి కాబట్టి క్రమం తప్పకుండా ఈ దుంపను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా బంగాళదుంపని తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
Also Read: King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం
మధుమేహం ఉన్నవారు బంగాళదుంపను ఎలా తినాలో తెలుసా?
డయాబెటిస్తో బాధపడేవారు నూనెలో వేయించిన బంగాళదుంపని తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తరచుగా ఈ దుంపను తినాలనుకునేవారు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర మధుమేహంతో బాధపడేవారు ఈ బంగాళదుంపను వారానికి ఒకసారి మాత్రమే తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.