Tea And Cigarette Side Effects: టీ, సిగరెట్ కలిపి తాగుతున్నారా? యమ డేంజర్!‌

Tea And Cigarette Side Effects: చాలా మంది యువత టీ, సిగరెట్ కలిపి తీసుకుంటూ ఉంటారు. నిజాని ఇలా ప్రతి రోజు చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వచ్చే వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 15, 2024, 02:22 PM IST
Tea And Cigarette Side Effects: టీ, సిగరెట్ కలిపి తాగుతున్నారా? యమ డేంజర్!‌

Tea And Cigarette Side Effects: ప్రస్తుతం చాలా మంది యువతలో సిగరెట్ ఒక హాబిగా మారింది. ఏ టీ కొట్టుల్లోనైనా యువత విచ్చలవిడిగా టీ తాగుతూ సిగరెట్ తాగడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. చాలా మంది యువత తమ ఒత్తడిని తగ్గించుకోవడానికి ఇలా తరచుగా చేస్తూ ఉంటారు. నిజానికి ఇలా ప్రతి రోజు టీతో పాటు సిగరెట్‌ తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. యువతలో దీర్ఘకాలిక వ్యాధుల రావడానికి ప్రధాన కారణాలు కూడా ఇవేనని వారంటున్నారు. 

టీ, సిగరెట్ కలిపి తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతంకు పైగా పెరుగుతుందని ఇటీవలే కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. టీలో అధిక పరిమాణంలో కెఫిన్ లభిస్తుంది. కాబట్టి సిగరెట్‌ తాగుతూ టీ తాగితే అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు కలిపి తాగే క్రమంలో బాగానే అనిపించినప్పటికీ భవిష్యత్‌లో అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చని వైద్యులు తెలుపుతున్నారు. 

2023 సంవత్సరంలో జర్నల్ అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. వేడి టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియలోనే ప్రేగుల కణాలు దెబ్బతినే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు సిగరెట్‌ తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ అలవాటు ఎక్కువ రోజుల పాటు కొనసాగితే క్యాన్సర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొంతమందిలో ప్రాణాంతకంగా కూడా మారొచ్చని వైద్యులు తెలుపుతున్నారు. 

ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాలు ప్రకారం.. టీలో కెఫీన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది కడుపులో ఒక రకమైన ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఖాళీ కడుపుతో టీ, సిగరెట్ కలిపి తాగితే తలనొప్పి నుంచి కళ్లు తిరగడం వరకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా ఇలా చేసేవారు తప్పకుండా మానుకోవడం చాలా మంచిది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

టీ, సిగరెట్ కలిపి తీసుకుంటే వచ్చే సమస్యలు:
పొట్ట క్యాన్సర్
కాలి పూతల
గుండెపోటు ప్రమాదం
పోట్టలో వ్రణము
మెమరీ లాస్‌
ఊపిరితిత్తుల క్యాన్సర్
గొంతు క్యాన్సర్
వంధ్యత్వం

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News