Pregnancy Symptoms: ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్లే..!

Pregnancy Symptoms: ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్లు ప్రస్తుతం మార్కెట్లో విస్త్రతంగా అందుబాటులో ఉన్నా కొన్ని లక్షణాలను మనం సులభంగా గమనించవచ్చు. గర్భందాల్చితే అనేక రకాల మార్పులు శరీరంలో కనిపిస్తాయి. చాలా రకాల హార్మోన్ల బ్యాలన్స్ లో మార్పులు జరుగుతాయి.  ముఖ్యంగా పీరియడ్స్ ఆగిపోవడం, వాంతులు, వికారం వంటివి కనిపిస్తాయి..

Written by - Renuka Godugu | Last Updated : Mar 12, 2024, 12:27 PM IST
Pregnancy Symptoms: ఈ 4 లక్షణాలు కనిపిస్తే మీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్లే..!

How to Find Pregnancy Symptoms in Telugu: సాధారణంగా గర్భందాల్చితే అనేక రకాల మార్పులు శరీరంలో కనిపిస్తాయి. చాలా రకాల హార్మోన్ల బ్యాలన్స్ లో మార్పులు జరుగుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్లు ప్రస్తుతం మార్కెట్లో విస్త్రతంగా అందుబాటులో ఉన్నా కొన్ని లక్షణాలను మనం సులభంగా గమనించవచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ ఆగిపోవడం, వాంతులు, వికారం వంటివి కనిపిస్తాయి..

బ్రెస్ట్ సైజు పెరగడం, స్ట్రెచ్ మార్క్స్, స్కిన్ సమస్యలు, యాక్నే కూడా వస్తుంది. నుదుటి మీద వస్తాయి. అంతేకాదు జుట్టు రాలడం కూడా ప్రెగ్నెన్సీలో భాగమే. మంచి ప్రొటీన్ డైట్ తీసుకుంటే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మన ఆరోగ్యానికి ఈ లక్షణాలు కనిపిస్తే మంచి మెడికేషన్ అందుబాటులో ఉన్నాయి. ఎక్సర్‌ సైజులతో బ్యాక్ పెయిన్ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. వాటర్ ఎక్కువగా ఉండే పండ్లు తినడం మంచిది. మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది.

ఇదీ చదవండి:  స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి

బ్లడ్ ప్రెజర్ లో మార్పులు కూడా వస్తాయి. దీనివల్ల బీపీ తగ్గడం, కళ్లుతిరగడం ఇలాంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి నడిస్తే ఆయాసం కూడా వస్తుంది. బ్లడ్లో కొద్దిమోతాదులో నీళ్లు చేరుతుంది. అంతేకాదు కొన్ని వస్తువులు తినాలనిపించడం మరికొన్ని తినకుండా ఉండాలనిపిస్తుంది. పొత్తికడుపులో కాస్త నొప్పిగా ఉంటుంది. మూత్రం కూడా ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రం ఆగదు కూడా. ఏదో ఒక విధంగా మనం ప్రెగ్సెన్సీని గమనించవచ్చు.

అందరిలో ఒకే విధమైన లక్షణం కనిపించదు. చాలా అరుదుగా కొంతమందికి ఏ లక్షణాలు కనిపించవు. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం మాత్రం పీరియడ్స్ ఆగిపోవడం. ముఖ్యంగా మొదటి మూడు నెలలు ఈ లక్షణాలు కనిపిస్తాయి.

పుల్లటి తేన్పులు కూడా రావచ్చు. గర్భసంచి పెరగడంతో ప్రెజర్ ఎఫెక్ట్ వల్ల యూరినరీ సమస్యలు వస్తాయి. యూరినరీ ట్రాక్ట్‌ చిన్నగా ఉంటే తెలియకుండానే యూరిన్ వెళ్లిపోతుంది. చిన్న ఎక్సర్ సైజులు, చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ప్రొజెస్టేరన్ హార్మోన్ వల్ల కొంతమందికి సయాటిక సమస్యల కనిపిస్తాయి.  అయితే, ఇవన్ని కొద్దిరోజుల తర్వాత సెట్ అయిపోతాయి. కొన్ని మానసిక గర్భం లక్షణాలు కనిపిస్తాయి. ఇవి బ్రెయిన్లో జరిగే హార్మోన్ మార్పులు. నిరసంగా ఉండటం, నిద్రలేమి సమస్య ఇవన్ని ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే మార్పులు. ఆందోళ కూడా వస్తుంది. 

ఇదీ చదవండి: ఈ 4 పదార్ధాలు తీసుకుంటే లోబీపీ ఇట్టే దూరం

మరో ఈ లక్షణం అందరికీ తెలిసిందే పీరియడ్ రాకపోవడం. ఇది కూడా ప్రెగ్నెన్సీని కన్పామ్ చేసే మరో లక్షణం. వీటన్నింటితోపాటు కొంతమందిలో తలనొప్పి కూడా వస్తుది. విటమిన్ డీ లేమి ఉంటే బ్యాప్ పెయిన్ వస్తుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. దీనికి ప్రధానం కారణం ప్రొజెస్టిరన్ హార్మోన్. మంచి ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. ఇందులో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. మైగ్రేన్ పెరిగిపోవడం కూడా జరుగుతాయి.

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News