Hypertention: చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ప్రధానమైంది హైపర్ టెన్షన్. ఇది చాలా ప్రమాదకరమైంది. హైపర్ టెన్షన్ అనేది చాలా సమయాల్లో ప్రాణాంతకమౌతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కావల్సింది హెల్తీ డైట్ మాత్రమే.
మనిషి ఆరోగ్యం అనేది ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్‌ని బట్టి ఉంటుంది. శరీరంలో రక్త పోటు సాధారణంగా ఉన్నంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. రక్తపోటు అదుపు తప్పితే చాలా విషమమైన వ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతుంది. చాలామంది అధిక రక్తపోటు గురించి చర్చింస్తుంటారు. కానీ లోబీపీ కూడా మరో ప్రదాన సమస్య అని గుర్తించరు. సాధారణ రక్తపోటు120-80 ఉంటుంది. అదే 90-60 ఉంటే అది హైపర్ టెన్షన్ కావచ్చు. ఈ పరిస్థితుల్లో హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, లంగ్స్‌పై ప్రబావం పడవచ్చు. అందుకే కొన్ని పదార్ధాలను డైట్ నుంచి తప్పించాల్సి ఉంటుంది.
సమయానికి తిండి తినకపోవడం వల్ల లేదా ఆలస్యంగా తినడం వల్ల రక్తపోటు పడిపోతుంది. ఈ పరిస్థితి తలెత్తినప్పుుడు తక్షణం కాఫీ తీసుకోవాలి. ఇందులో ఉండే కెఫీన్ రక్తపోటును పెంచి సాధారణ స్థాయికి చేరుకుంటుంది.
నీరు
శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. రోజుకు 2-3 లీటర్లు నీళ్లు తప్పకుండా తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం లేదా నీళ్లు తప్పకుండా తాగాలి
ఉప్పు
లోబీపీ సమస్యతో బాధపడేవాళ్లు ఉప్పు తప్పకుండా సేవించాలి. తక్షణం బీపీ సాధారణానికి చేరుకోవాలంటే నిమ్మరసం ఉప్పు కొద్దిగా కలుపుకుని తాగాలి. దీనివల్ల శరీరానికి తక్షణ ఎనర్జీ లభిస్తుంది.
బాదం
బాదం లాభాల గురించి అందరికీ తెలిసిందే. బాదం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే రాత్రి వేళ కొంత బాదం తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
Also read: Turmeric Water: పరగడుపున పసుపు నీళ్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook