vitamin b12 deficiency: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్లప్పుడు పోషక ఆహారంతో కూడిన పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే కొన్ని విటమిన్ లోపం కారణంగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. దీని కోసం చాలా మంది స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
శరీరానికి నిద్ర చాలా అవసరం. నిద్ర పట్టకపోతే డిప్రషెన్స్ , మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ఈ సమస్యలు శరీరంలో విటమిన్ బీ-12 లోపించినప్పుడు మొదలవుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం శీరరంలో విటమిన్ బీ-12 చాలా అవసరం. విటమిన్ బీ-12 కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
విటమిన్ బీ-12 ఎందుకు కలుగుతుంది:
మనలో చాలా మంది మాంసం, ఆకుకూరలు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటారు. అయితే ఈ పదార్థాలు తీసుకోకపోవడం వల్ల విటమిన్ బీ-12 అనేది లోపిస్తుంది. విటమిన్ బీ-12 అనేది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై చూపిస్తుంది. కానీ ఇది శరీరం తనంతట ఉత్పత్తి చేయలేదు. కాబట్టి కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ బీ-12 అనేది ఎక్కువగా కొన్ని ఆహార పదార్థాల్లో లభిస్తుంది. వాటిలో పాల ప్రొడెట్స్, బచ్చలికూర, ట్యూనా, బీట్రూట్, పుట్టగొడుగులు, సాల్మన్ వీటిని విటమిన్ బీ-12 ఉంటుంది. అంతేకాకుండా ఉడికించిన గుడ్లను తినడం వల్ల కూడా విటమిన్ బీ 12 లభిస్తుంది.
Also Read Health Benefits: ఈ సీజనల్ ఫ్రూట్ తింటే చాలు మలబద్ధకం, జీర్ణ సమస్యలు అన్నీ మటుమాయం
విటమిన్ బీ-12 ఆహార పదార్థాలు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా అవసరం. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతే కాకుండా విటమిన్ బీ-12 తీసుకుంటే నిద్రపట్టకపోవడం అనే సమస్య ఉండదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ప్రతిరోజు మీ ఆహారంలో ఈ విటమిన్ బీ-12 ఉండేలా చూసుకోవాలి. విటమిన్ తీసుకోవడం శరీరానికి చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు.
Also Read Beauty tips: రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే 50 ఏళ్లయినా నిత్య యౌవనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter