Finger Millets: రాగులతో అద్భుత లాభాలు, కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చు

Finger Millets: రాగులు లేదా సోళ్లు పిండి. పాతకాలపు ఆహారమే అయినా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వింటే ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఆ ఉపయోగాలేంటో చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2022, 01:32 PM IST
 Finger Millets: రాగులతో అద్భుత లాభాలు, కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చు

Finger Millets: రాగులు లేదా సోళ్లు పిండి. పాతకాలపు ఆహారమే అయినా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వింటే ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఆ ఉపయోగాలేంటో చూద్దాం..

నిత్య జీవితంలో మన ఆహారపు అలవాట్లే ఆరోగ్య సంరక్షణ లేదా అనారోగ్యానికి కారణమవుతాయి. ప్రతి వంటింట్లో లభించే వివిధ రకాల ఆహారపదార్ధాలతోనే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రాగులు లేదా సోళ్లు పిండి. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రతిరోజూ క్రమ తప్పకుండా రాగుల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వేసవిలో రాగులు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అటు అలసట కూడా తగ్గుతుంది. ఇక మరో ముఖ్యమైన అంశం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రాగుల్లో ఉండే ఫైబర్..గ్లెసీమియా షుగర్ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. ఇన్సులిన్ నిల్వ చేయడంలో రాగులు అద్భుతంగా పనిచేస్తాయి.

ఇక రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు కేన్సర్ కారకాల్ని నాశనం చేస్తాయి. ఇందులో యాంటీ ఏజీయింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి..క్రమం తప్పకుండా తీసుకుంటే నిత్యం యవ్వనంగా ఉంటారు. రాగుల్లో ఉండే  మెగ్నీషియం, పొటాషియంలు శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. రాగుల్లో ఉండే మినరల్స్, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. రక్తశాతం పెంచడమే కాకుండా, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతాయి. రక్తహీనత ఉండేవాళ్లు తప్పకుండా తీసుకోవాలి. ఇక రాగుల్లో ఉండే ఎమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా..బరువు తగ్గిస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. కీళ్లనొప్పులు మాయమవుతాయి. పాలిచ్చే తల్లులు రాగులు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం. ఇందులో ఉండే ఎమైనో యాసిడ్స్ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి.

రాగులనేవి ఎదిగే పిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారం. అయితే కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సంబంధిత వ్యాధులున్నవాళ్లు తీసుకోకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులకు దూరంగా ఉండాలి. 

Also read: Pomegranate Benefits: దానిమ్మ విత్తనాలు లేదా జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News