Coconut Water For Weight Loss: బరువు పెరగడం కారణంగా చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా వీటి వల్ల చాలా మంది గుండెపోటు సమస్యల బారిన కూడా పడుతున్నారు. బరువు పెరగడం కారణంగా కొంతమందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా శరీరం అందహీనంగా తయారవుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఇక నుంచి బాధపడనక్కర్లేదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బాడీని ఫిట్‌గా తయారు చేసుకోవడానికి పలు డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
నేచురల్ డ్రింక్‌తో బరువు తగ్గడం ఎలాగో తెలుసా?:
శరీర బరువును తగ్గించుకోవడానికి కొబ్బరి నీరు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీరును రెగ్యులర్‌గా తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో పోషకాలు, విటమిన్స్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి.
కొబ్బరి నీటిలో లభించే పోషకాలు:
కొబ్బరిలో నీళ్లలో ఆయుర్వేద గుణాలుతో పాటు విటమిన్లు, మినరల్స్, సహజసిద్ధమైన ఎంజైమ్‌లు అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ నీటిని తాగడం వల్ల హైడ్రేషన్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
బరువు తగ్గడానికి కొబ్బరి నీరు ఎలా సహాయపడుతుంది:
కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర, తక్కువ మోతాదు కేలరీలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ నీటిని తాగితే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారానికి బదులుగా ఒక పండ్ల రసం, కొబ్బరి నీరు తీసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
ఎప్పుడు ఎలా తాగాలో తెలుసా?:
ప్రతి రోజు కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి