Weight Loss Drinks At Home: ఎండా కాలం రాగానే మనకు గుర్తుచ్చేవి మామిడి పండ్లు, పలు రకాల పానియాలు. ముఖ్యంగా పానియాల విషయానికి వస్తే.. నిమ్మరసం వంటివి తాగడానికి అందరు ఇష్టపడతారు. ఈ డ్రింక్‌ని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది మార్కెట్లలో విచ్చల విడిగా లభిస్తాయి. చాలా మంది నిమ్మరసం సోడా వాటర్‌తో కలిపి తాగడానికి ఇష్టపడతారు. ఇలా తాగడం వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
నిమ్మరసం బరువు తగ్గిస్తుందా..?
లెమన్ వాటర్ రెగ్యులర్‌గా తాగడం వల్ల బరువు తగ్గిస్తాయని మనం వినే ఉంటాం.. ఉదయాన్నే ఖాళీకడుపుతో ఒక గ్లాసు నిమ్మరసం తాగితే పొట్ట తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. చాలా మంది ఈ డ్రింక్‌లో తేనె కూడా కలుపుకుని తాగుతారు. ఇలా తాగడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే లెమన్ వాటర్ నిజంగా బరువు తగ్గుతుందా? అనే ప్రశ్నకు చాలా సమాధానాలున్నాయి.
నిమ్మకాయ నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి-6, పెక్టిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిమ్మరసాన్ని రోజు తీసుకోవడం వల్ల పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గించి..బరువును వేగంగా తగ్గిస్తుంది.
ఆకలిని నియంత్రిస్తుంది:
నిమ్మకాయలో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ రసాన్ని తాగిన తర్వాత.. ఆయిల్ ఫుడ్ తినాలనే కోరిక కూడా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు జీవక్రియను పెంపొందించి..శరీరంలోని డిటాక్స్‌ను బయటకు పంపిస్తాయి.
నిమ్మరసాన్ని ఎలా సిద్ధం చేయాలి?:
ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని.. అందులో చిన్న నిమ్మకాయను పిండాలి. ఇప్పుడు అందులో చిటికెడు నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి తాగాలి. ఉదయాన్నే నిద్రలేచి వేంటనే ఇలా తాగితే బరువు త్వరగా తగ్గుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Wheatgrass Benefits: మధుమేహం వ్యాధి ఉన్నవారు ఈ జ్యూస్ తాగండి..!!
Also Read:Tender Coconut Water Benefits: ఎండాకాలంలో లేత కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా..? అయితే వీటి వల్ల వచ్చే 4 ప్రయోజనాలు తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook