Vegetable Juice For Weight Loss: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడం చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా ఆధునిక జీవనశైలి కారణంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర శ్రమ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే డైట్ తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని జ్యూస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేగంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ జ్యూస్‌లని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది
ఈ కూరగాయల రసాల ప్రతి రోజు తాగండి:
క్యారెట్ జ్యూస్:
ఈ జ్యూస్‌ను ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్యారెట్ జ్యూస్‌లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్‌ను ప్రతి రోజు తాగడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారు.
Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
బీట్‌రూట్ జ్యూస్:
బరువు తగ్గాలనుకునేవారు బీట్‌రూట్ రసం ప్రతి రోజు తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ శరీర బరువును సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్‌రూట్ రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.
కాకర రసం:
కాకరకాయ తినడానికి కొంత మంది ఇష్టపడరు..అయితే బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కాకర జ్యూస్‌ని తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ రసాన్ని తాగొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook