Weight Loss: ఈ పండ్ల‌ను తింటే చాలు.. అధిక బ‌రువు సమస్యకు చెక్‌!!

Fruits For Weight Loss: అధిక బరవు తగ్గాలి అనుకొనేవారు ఆహార పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైబర్, విటమిన్‌ సి ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అయితే కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.    

Written by - Shashi Maheshwarapu | Last Updated : Aug 3, 2024, 11:42 AM IST
Weight Loss: ఈ పండ్ల‌ను తింటే చాలు.. అధిక బ‌రువు సమస్యకు చెక్‌!!

Fruits For Weight Loss:  అధిక బరువు సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆహారం కీలక ప్రాతను పోషిస్తుంది. పోషకారమైన తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఆరోగ్యానిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లను తినడం వల్ల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.  ఎలాంటి పండ్లను ఆహారంగా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

పుచ్చకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పుచ్చకాయలో 92% వరకు నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలో విటమిన్ A, C లాంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. 

యాపిల్ కూడా బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. పెర్సిమ్మోన్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి. బెర్రీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కాళ్ళ మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ కె ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  

గ్రేప్ ఫ్రూట్ బరువు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే పండు. ఇది కేలరీలను వేగంగా బర్న్‌ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అవకాడో పోషకరమైన ఆహారం. దీని ఎక్కువగా సలాడ్స్‌, బ్రేక్ ఫాస్ట్‌లో ఉపయోగిస్తారు.  రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరానికి అవసరమైన కొవ్వులను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైనేపిల్ ఆరోగ్యకరమైన పండు. ఇందులో ప్రోటీన్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే మాంగనీస్‌ ఎముకలను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

ఆరెంజ్‌లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల  జీర్ణక్రియను మెరుగుపరచవచ్చు. రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ద్రాక్ష పండు కూడా బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News