Weight Loss Tips: బరువు తగ్గేక్రమంలో రాత్రి పూట ఇలా చేస్తున్నారా.. అస్సలు తగ్గరు ఇలా చేస్తే..

Weight Loss Tips: చాలా మంది బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల తప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గే క్రమంలో రాత్రిపూట ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి ఇలా చేయకపోవడం చాలా మంచిది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 06:11 PM IST
  • బరువు తగ్గేక్రమంలో
  • రాత్రి పూట ఇలా చేస్తున్నారా..
  • అస్సలు బరువు తగ్గరు ఇలా చేస్తే..
Weight Loss Tips: బరువు తగ్గేక్రమంలో రాత్రి పూట ఇలా చేస్తున్నారా.. అస్సలు తగ్గరు ఇలా చేస్తే..

Weight Loss Mistakes At Night: చాలామంది బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఊబకాయం వ్యాధి కానప్పటికీ.. ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు గుండె సమస్యలు, మధుమేహం ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బరువును ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరైతే బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆహార నియమాలు పాటించడం లేదు. అంతేకాకుండా డైట్లను ఫాలో అవ్వకుండా రాత్రిపూట విచ్చలవిడిగా ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి.

తగ్గే క్రమంలో రాత్రిపూట అస్సలు ఇలా చేయకూడదు:
చాలామంది పడుకునే సమయంలో కూల్ డ్రింక్స్ విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు పేరుకు పోతుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో శీతల పానీయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట ఆహారాలను అతిగా తీసుకోవడం:
ఓవర్ నైట్ సమయంలో బరువు తగ్గాలనుకునే వారు ఆహారాలను అధిక పరిమాణంలో తీసుకుంటున్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు దీనిని గమనించి రాత్రిపూట ఫైబర్ ఆర్థిక పరిమాణంలో లభించే ఆహారాలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం:
చాలామంది బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట అనుకోకుండా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News