Weight Loss Tips: బరువు తగ్గడానికి చాలా మంది డైట్‌లను అనుసరిస్తారు. అంతేకాకుండా ఉదయాన్నే పరిగడుపున చాలా మంది ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకుంటారు. బరువు తగ్గడం అనేది ప్రతి రోజు తీసుకునే ఆహారాలు, డ్రింక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు. కానీ బరువు తగ్గడానికి చాలా కొంతమంది మాత్రమే ఈ చిట్కాను వినియోగిస్తున్నారు. అయితే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా? అయితే ఈ చిట్కాపై ఆయుర్వేద నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి:
నిపుణుల అభిప్రాయం ప్రకారం..నిమ్మ రసం, తేనె కలిపిన గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ నీటిని ప్రతి రోజు తాగేవారు వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట ఉబ్బరం, అధిక పొట్ట నుండి ఉపశమనం లభిస్తుంది.
రోజూ తాగే ముందు ఇలా చేయండి:
ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్రింక్‌ను తయారు చేసే క్రమంలో తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించన కొన్ని సూచనలు తప్పకుండా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా దీనిని తయారు చేసుకునే క్రమంలో కేవలం టీస్పూన్ కంటే ఎక్కువ తేనెను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో మాత్రమే నిమ్మ రసాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం ఒక్క నిమ్మకాయను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. దాని కంటే ఎక్కువ నిమ్మకాయలను వినియోగించడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ఈ లక్షణాలపై దృష్టి పెట్టండి:
గోరువెచ్చని నిమ్మ రసం తాగడం వల్ల కొందరిలో అనేక లక్షణాలు వస్తాయి. ఈ నీటి తాగిన తర్వాత మీ పొట్ట తేలికగా అనిపిస్తుంది. అంతేకాకుండా గుండెల్లో మంట, దంతాలు కోరలు పోవడం, నోటి పూతలు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి నిమ్మరసాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తేనెను కూడా తగిన పరిమాణంలోనే కలుపుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యాధులున్నవారు తాగొద్దు:
కీళ్లనొప్పులు, అధిక ఆమ్లత్వం, బలహీనమైన ఎముకలు, బలహీనమైన దంతాలు, నోటిపూత మొదలైన వాటితో బాధపడుతున్న వారు ఈ చిట్కాను వినియోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ వినియోగిస్తే వైద్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Weight Loss Tips: నిమ్మ రసం, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగితే బరువు నిజంగా తగ్గుతారా?