weight loss Tips: ఈ సూప్‌లు బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తాయి! రోజువారీ డిన్నర్ లో చేర్చుకోండి!

Weight Loss Soup : శరీరంలో కొవ్వు తగ్గాలంటే...మీరు తప్పనిసరిగా మీ డిన్నర్‌లో కొన్ని సూప్‌లను చేర్చుకోవాలి. ఇవీ మీ బరువును తగ్గించడంలో, మిమ్మల్ని ఆరోగ్యం ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 02:46 PM IST
  • మీ బరువు తగ్గాలంటే
  • ఈ సూప్ లను రోజువారీ డిన్నర్ లో చేర్చండి
weight loss Tips: ఈ సూప్‌లు బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తాయి! రోజువారీ డిన్నర్ లో చేర్చుకోండి!

Soup Help For Weight Loss: శరీరంలో కొవ్వు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫాట్ తగ్గించడానికి అన్ని రకాలుగా ట్రై చేసి..చివరకు విసిగిపోయిన వ్యక్తులు చాలా మందే ఉంటారు. అటువంటి వారి కోసం మేము కొన్ని చిట్కాలు (diet tips) తీసుకొచ్చాం. చాలా మంది బరువు పెరగడం వల్ల కలత చెంది రాత్రిపూట భోజనం మానేస్తారు. మీరు మీ డిన్నర్‌లో సూప్‌ను చేర్చుకుంటే, మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఇది మీ శరీరంలోని అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఈ సూప్‌లు (Soups) ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు తగ్గడంలో కూడా దోహదపడతాయి. 

మీరు బరువు తగ్గడానికి మసూర్ పప్పు, పాలకూర మరియు గుమ్మడికాయ సూప్‌లను  ట్రై చేయండి. ఈ మూడు సూప్‌లు తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉండే ఆస్ట్రా ఫ్యాట్ తగ్గుతుంది. ఈ సూప్‌లు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మారుతున్న జీవనశైలిలో, మీరు దీన్ని మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. 

గుమ్మడికాయ సూప్: 
గుమ్మడికాయ సూప్ శరీర బరువును తగ్గిస్తుంది. దీని కోసం, కుక్కర్‌లో గుమ్మడికాయను బాగా ఉడకబెట్టండి. గుమ్మడికాయకు నల్ల మిరియాలు జోడించండి. ఇప్పుడు దానిపై కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. మీకు కావాలంటే, మీరు దానికి ఉప్పు కూడా యాడ్ చేయెచ్చు.  రోజూ రాత్రి భోజనంలో ఈ సూప్ తీసుకోవడం వల్ల శరీర బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.

Also Read: Reduce Your Body weight: శరీర బరువు తగ్గించే గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్‌ట్రాక్ట్..

పాలకూర సూప్: 
పాలకూర సూప్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. నిజానికి, పాలకూరలో ఫైబర్ ఉంటుంది, ఇది బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తోంది. 

మసూర్ పప్పు సూప్: 
మసూర్ పప్పు సూప్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఈ సూప్ సిద్ధం చేయడానికి, ఒక కుండలో ఉల్లిపాయ, సెలెరీ, వెల్లుల్లి, కాయధాన్యాలు మరియు టమోటాలు ఉంచండి. ఆ తర్వాత దానికి ఉప్పు, కారం వేయాలి. దీని తర్వాత మీరు మీ అభిరుచికి అనుగుణంగా కొన్ని సుగంధాలను జోడించవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News