మహిళలకు 40-45 ఏళ్ల వయస్సు వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో వివిధ రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రభావమంతా ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది. ఎలాంటి సమస్యలు వస్తుంటాయి, రక్షణ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం..
మహిళలకు నిర్ణీత వయస్సు అంటే 40-45 ఏళ్లు దాటాక చాలా సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా రక్త హీనత ఎదురౌతుంది. ఈ క్రమంలో డైట్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. మిడిల్ ఏజ్‌లో మహిళలు ప్రతి రోజూ దానిమ్మ తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటుంటే ఆరోగ్యం బాగుంటుంది. దానిమ్మలో పోషక గుణాలు చాలా ఎక్కువ. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. మిడిల్ ఏజ్ మహిళలకు ఉపయోగకరం. దానిమ్మలో పోలీఫెనోల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి లాభదాయకం.
దానిమ్మతో మహిళలకు కలిగే లాభాలు
వయస్సు పెరిగితే ఆ ప్రభావం కేశాలపై తప్పకుండా పడుతుంది. దానిమ్మ రోజూ తీసుకుంటే మీ కేశాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల స్కాల్ప్ బలంగా ఉంటుంది. కేశాలకు మంచి నిగారింపు వస్తుంది.
హెల్తీ స్కిన్
పెరుగుతున్న వయస్సు ప్రభావం మన చర్మంపై చాలా అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ముఖంపై ఎక్కువగా ఉంటుంది. అందుకే చర్మం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. చర్మం నిగనిగలాడేందుకు, ముఖంపై మచ్చలు దూరమయ్యేందుకు దోహదపడుతుంది. అందుకే దానిమ్మ ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మజిల్స్ రికవరీ
వయస్సు పెరిగే కొద్దీ బరువైన పనులు చేయడం కష్టమౌతుంది. మజిల్స్ ఒత్తిడికి లోనవుతాయి. ఫలితంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. రికవరీకు ఎక్కువ సమయం పడుతుంది. రోజూ ఒక దానిమ్మ తింటే మజిల్స్ త్వరగా రికవర్ అవుతాయి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also read: Diet For Weight Loss: చలి కాలంలో రాత్రి పూట ఈ 5 పనులు చేస్తే.. ఎంతటి బరువైనా దిగి రావడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook