Krithi Shetty Photos: హోలీ రంగుల్లో కృతిశెట్టి సోయగానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Krithi Shetty Photos: హోలీ సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టి స్పెషల్​  ఫొటో షూట్​లో పాల్గొంది. సిగ్గులొలకబోస్తూ ఆ ఫొటోలలో అందంగా ఉందీ భామ.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 06:35 PM IST
Krithi Shetty Photos: హోలీ రంగుల్లో కృతిశెట్టి సోయగానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Krithi Shetty Photos: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. గతేడాది 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు' సినిమాతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో కృతి శెట్టి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. 

కృతిశెట్టి.. హోలీ సందర్భంగా ఫొటోషూట్ లో పాల్గొంది. వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలలో కృతి శెట్టి సిగ్గుపడుతూ కనిపించింది. ఆ సిగ్గును చూసి నెటిజన్లు ఆమె సోయగానికి ఫిదా అయిపోతున్నారు. కుర్రకారు మదిని దోచేస్తున్న ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వరుస సినిమాలతో బిజీ..

కృతిశెట్టి ప్రస్తుతం.. రామ్ హీరోగా లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది వారియర్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనువిందు చేయనున్నారు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. మరోవైపు నితిన్ హీరోగా రూపొందుతోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా ఎంపికైంది. 

దీంతో పాటు టాలీవుడ్ లో ఇప్పుడు ఓ బిగ్ న్యూస్ వైరల్ గా మారింది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని.. అందులో ఈ అమ్మడిని హీరోయిన్ గా ఎంచుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

Also Read: Standup Rahul Review: స్టాండప్ రాహుల్ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా?

Also Read: Bheemla Nayak OTT: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News