Biriyani Customer Death: ఎక్స్‌ట్రా రైతా అడిగినందుకు మెరిడియన్ హోటల్ సిబ్బంది దాడి.. కస్టమర్ మృతి

Panjagutta Meridian Hotel Attack On Customer: బిర్యానీలోకి ఎక్స్ ట్రా రైతా అడిగినందుకు ఓ కస్టమర్‌పై రెస్టారెంట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయనపడిన కస్టమర్.. హోటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2023, 05:21 PM IST
Biriyani Customer Death: ఎక్స్‌ట్రా రైతా అడిగినందుకు మెరిడియన్ హోటల్ సిబ్బంది దాడి.. కస్టమర్ మృతి

Panjagutta Meridian Hotel Attack On Customer: హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బిరియానీలోకి ఎక్స్‌ట్రా రైతా (పెరుగు) అడిగినందుకు ఓ కస్టమర్‌పై దాడికి పాల్పడ్డారు హోటల్ సిబ్బంది. ఈ దాడిలో కస్టమర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ రెస్టారెంట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. లియాకత్ అనే వ్యక్తి మెరిడియన్ రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశాడు. ముందుగా బిర్యానీతో పాటు ఒక కప్పు రైతా ఇచ్చారు. 

అయితే తనకు ఒక కప్పు సరిపోదని.. మరో కప్పు కావాలని వెయిటర్స్‌ను అడిగాడు. ఈ విషయంలో మెరిడియన్ సిబ్బంది దురుసుగా సమాధానం ఇవ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వెయిటర్స్ అందరూ కలిసి.. లియాకత్‌పై దాడికి దిగారు. అతడినికి చితకబాదారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే మెరిడియన్ హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికి లియాకత్ బాగానే కనిపించాడు. అతడితోపాటు రెస్టారెంట్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్టేషన్‌లో లియాకత్ పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే అతడిని డెక్కన్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. లియాకత్‌పై దాడికి పాల్పడిన రెస్టారెంట్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ మద్దతుగా నిలిచారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ సిబ్బందికి దాడికి పాల్పడిన దృశ్యాలు ఆదివారం రాత్రి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News