Infant raped : ఉత్తరప్రదేశ్‌లో 10 ఏళ్ల పసికందుపై కామాంధుడి అత్యాచారం...

Infant raped : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు 10 ఏళ్ల పసికందుపై అత్యాచారానికి (Rape on infant) పాల్పడ్డాడు. లైంగిక దాడితో శిశువు జననాంగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆ శిశువుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 12:08 PM IST
  • ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం
    10 ఏళ్ల పసికందుపై పనిమనిషి అత్యాచారం
    తల్లి గమనించడంతో పరారైన నిందితుడు
    ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు
Infant raped : ఉత్తరప్రదేశ్‌లో 10 ఏళ్ల పసికందుపై కామాంధుడి అత్యాచారం...

Infant raped in Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై ఓ కామాంధుడు అత్యాచారానికి (Rape on infant) పాల్పడ్డాడు. ఆ కామాంధుడు చేసిన పనికి పసికందు జననాంగాలు చిధ్రమయ్యాయి. లక్నోలోని సాదత్‌గంజ్ ప్రాంతంలో ఆదివారం (నవంబర్ 15) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ పసికందును బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి తల్లి కిచెన్‌లో పనిచేసుకుంటోంది. ఇంతలో పాప (Infant) బిగ్గరగా ఏడవడంతో తల్లి వెంటనే బెడ్‌రూమ్‌లోకి పరిగెత్తింది. అక్కడ కనిపించిన సీన్ చూసి ఆమె షాక్ తిన్నది. ఇంట్లో పనిచేసే సన్నీ అనే వ్యక్తి పసికందుపై లైంగిక దాడికి (Rape) పాల్పడటం ఆమె కళ్లారా చూసింది. అతనితో వాగ్వాదానికి దిగగా.. వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు.

అనంతరం ఆ పసికందు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై లైంగిక దాడితో పాటు పోక్సో చట్టం (Pocso act) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ పసికందు కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(KGMU)లో పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతోంది. శిశువు ఆరోగ్యంపై పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ జేడీ రావత్ మాట్లాడుతూ... లైంగిక దాడి కారణంగా శిశువు జననాంగాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయినప్పటికీ శిశువు స్పృహలోనే ఉందని చెప్పారు. మల, మూత్ర విసర్జన సమయంలో శిశువుకు నొప్పిగా ఉంటోందని... ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత... అవసరమైతే రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ చేస్తామని వెల్లడించారు.

Also Read: Corona Update in India:భారీగా తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్పం

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మహిళలు, చిన్నారులపై నేరాలు, అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 8 నెలల కాలంలో మహిళలపై నేరాలకు (Crime against women) సంబంధించిన ఫిర్యాదులు దేశవ్యాప్తంగా 46శాతం (19,953 ఫిర్యాదులు) పెరిగాయి. ఇందులో సగానికి పైగా ఒక్క ఉత్తరప్రదేశ్‌లో నమోదైనవే కావడం గమనార్హం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News