కరోనా కాలం ( Coronavirus ) తరువాత అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం లాక్ డౌన్ లో ( Lockdown ) నిలిచిపోయిన జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆధ్మాత్మిక క్షేత్రాలను పలు మార్గదర్శకాలతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ALSO READ| Corona Effect: కరోనా కాలంలో భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం
జమ్మూలోని కట్రాలో ఉన్న మాతా వైష్ణో దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు శ్రైన్ బోర్డు ఊరటనిచ్చే విషయం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్యను పెంచింది. బోర్డు ప్రకారం. ఇప్పుడు 1000 మంది భక్తులు ప్రతీ రోజు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి చేరుకోవచ్చు. గతంలో ఈ సంఖ్య 500 గా ఉంది.
హారతిలో భాగం అయ్యే అవకాశం
పైన తెలిపిని అంశాలతో పాటు శ్రైన్ బోర్డు వైష్ణో దేవీ భక్తులను అట్కా హారతీలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. భక్తులు ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవడంతో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా అట్కా హారతీలో చేరే అవకాశం ఉంది. అట్కా హరతిలో ఒకేసారి 300 మంది చేరే అవకాశం ఉంది అని బోర్డు తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి నుంచి భక్తులను రక్షించడానికి కేవలం 90 మందికి మాత్రమే కూర్చునే అవకాశం కల్పిస్తోంది. ఈ సమయంలో భక్తులు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట
ప్రారంభం కానున్న డార్మట్రీ సేవలు
శ్రైన్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం వైష్ణోదేవి భవనంతో పాటు భక్తులకోసం మరోచోట డార్మట్రీ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR