'కరోనా వైరస్' కారణంగా దాదాపు 2 నెలలకు పైగా లూప్ లైన్లకే పరిమితమైన రైళ్లు.. క్రమక్రమంగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే వలస కూలీల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు, సాధారణ ప్రయాణీకుల కోసం పరిమిత సంఖ్యలో రైల్వే సర్వీసులు నడిపిస్తున్న రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ 5.0లో భాగంగా రైల్వే సర్వీసులపై మరిన్ని ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా మరిన్ని ఎక్కువ సర్వీసులు నడిపించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి ( జూన్ 1) 200 రైల్వే సర్వీసులు నడపనున్నట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 8 రైళ్లు అదనంగా రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైళ్లు నడవనున్నట్లు తెలుస్తోంది.
200 Special Trains to run across the country from tomorrow, transporting people in a safe & comfortable manner.
कल से देश भर में शुरु हो रही हैं 200 स्पेशल ट्रेन, नागरिकों का घर जाना होगा और आसान व सुरक्षित।
▶️ https://t.co/kEtCULH08A pic.twitter.com/1lP3jg5H4u
— Piyush Goyal (@PiyushGoyal) May 31, 2020
ఐతే గతంలో ఉన్న విధంగానే ఈ రైల్వే సర్వీసులకు కూడా ఆన్ లైన్ లోనే టికెట్ బుకింగ్ ఉంటుంది. రిజర్వేషన్ టికెట్లు తప్ప సాధారణ టికెట్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన వారు మాత్రమే స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. మిగతా వారిని ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ లోకి అనుమతించరు. ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అంతే కాదు ఆహారం కూడా ఇంటి నుంచే తెచ్చుకోవాలి. రైలు బయల్దేరడానికి కనీసం 90 నిముషాలు అంటే గంటన్నర ముందు స్టేషన్ కు చేరుకోవాలి.
కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణీకులను ఎట్టి పరిస్థితుల్లో రైలులో ప్రయాణం చేసేందుకు అనుమతించరు. అలాగే గతంలో ఉన్న విధంగానే రైలులో ఎలాంటి దుప్పట్లు, న్యాప్కిన్స్ ఇవ్వడం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఇంటి నుంచి దుప్పట్లు తెచ్చుకోవాలని సూచించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
రేపటి నుంచి 200 రైల్వే సర్వీసులు..!!