2018 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‌(యూపీఎస్సీ) నిర్వహించిన 2018 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలను శనివారం విడుదల చేశారు.

Last Updated : Jul 14, 2018, 08:28 PM IST
2018 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‌(యూపీఎస్సీ) నిర్వహించిన 2018 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైటులో వీక్షించవచ్చు. పీడీఎఫ్ రూపంలో ఈ ఫలితాల జాబితా వెబ్ సైటులో లభ్యమవుతుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) వంటి పౌరసేవ ఉద్యోగాల్లో చేరాలనుకునే వ్యక్తులు రాయాల్సిన పరీక్షే సివిల్స్ సర్వీసెస్. ఈ సారి సివిల్స్ ద్వారా 782 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ తర్వాత జరిగే మెయిన్స్ పరీక్షలో తొమ్మిది పేపర్లను అభ్యర్థి రాయాల్సి ఉంటుంది.  మొత్తం 1750 మార్కులకు మెయిన్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. 

మెయిన్స్ తర్వాత నిర్వహించే మౌఖిక పరీక్షలో ఖాళీల సంఖ్యకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల వడబోత ఉంటుంది. తాజాగా విడుదలైన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్లలో వీక్షించవచ్చు. యూపీ‌ఎస్సీ సివిల్ సర్వీసెస్ 2017 పరీక్షల ఫలితాల్లో తెలంగాణ మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన అనుదీప్ దూరిశెట్టి దేశంలోనే తొలి ర్యాంకును కైవసం చేసుకున్నారు. 2016 ఫలితాల్లో  శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గకి చెందిన రోణంకి గోపాలకృష్ణ మూడవ ర్యాంకు సాధించారు. 

Trending News