నౌకాదళంలో 'కరోనా' కలకలం

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ వైరస్.. ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టడం లేదు. భారత దేశంలోనూ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 

Last Updated : Apr 18, 2020, 09:33 AM IST
నౌకాదళంలో 'కరోనా' కలకలం

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ వైరస్.. ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టడం లేదు. భారత దేశంలోనూ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 

సామాన్య పౌరులు, వీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు, ఆడ, మగ, పిల్ల, పెద్ద..ఇలా ఎలాంటి తేడాలు లేకుండా అందరినీ కబలించివేస్తోంది కరోనా వైరస్. ఇప్పుడు తాజాగా ఈ మహమ్మారి భారత నావికాదళంలోనూ కలకలం సృష్టిస్తోంది. ముంబైలోని నావికాదళంలో ఏకంగా 21 మందికి కరోనా వైరస్ సోకడం ఇప్పుడు గుబులు రేకెత్తిస్తోంది.

ముంబైలోని ఐఎన్ఎస్ యాంగ్రేలో 21 మంది నావికాదళ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా నావికా దళంలో కలకలం రేగింది. నావికాదళ సిబ్బందిలో 20 మంది సెయిలర్స్ ఉన్నారు. వారిలో కరోనా వైరస్ .. అంతర్లీనంగా దాగి ఉంది. అంటే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా వైరస్ సోకడం గమనార్హం.  

ఏప్రిల్ 7న నావికాదళంలో సెయిలర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయింది. ఆ తర్వాత సరిగ్గా 11 రోజుల తర్వాత 20 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఐఎన్ఎస్  యాంగ్రేలో పని చేస్తున్న సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. ఐఎన్ఎస్ యాంగ్రేను కంటైన్‌మెంట్ జోన్‌గా  ప్రకటించారు. ఆ ప్రాంతంలో పూర్తిగా లాక్ డౌన్ విధించారు. 

మరోవైపు ఆన్ బోర్డ్ షిప్‌లలో, సబ్ మెరైన్‌లలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కాలేదని భారత నావికా దళం తెలిపింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News