నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

దేశమంతా.. 'కరోనా వైరస్'ను ఎదుర్కునే పనిలో పోరాటం చేస్తోంది. వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది.. జనాన్ని కాపాడడంలో బిజీగా ఉన్నారు. మరోవైపు పోలీసులు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిరంతరం రోడ్లపైనే గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. 

Last Updated : Apr 4, 2020, 10:32 AM IST
నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

దేశమంతా.. 'కరోనా వైరస్'ను ఎదుర్కునే పనిలో పోరాటం చేస్తోంది. వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది.. జనాన్ని కాపాడడంలో బిజీగా ఉన్నారు. మరోవైపు పోలీసులు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిరంతరం రోడ్లపైనే గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. 

సందు చూసి భారత దేశంలో దాడులు చేసేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.అవును.. లష్కర్ ఏ తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను .. వారికి సహకరిస్తున్న మరో ఐదుగురు వ్యక్తులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హంద్వారా, సోపోర్ జిల్లాల్లో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో హంద్వారా జిల్లాలోని గుండ్ చోగల్ గ్రామంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 3 ప్రాంతాల్లో  దాడులు  చేసినట్లు హంద్వారా జిల్లా ఎస్పీ జీవీ సందీప్ చక్రవర్తి వెల్లడించారు. పట్టుకున్న ఉగ్రవాదులను పర్వీజ్ అహ్మద్ చోపాన్, ముదాసిర్ అహ్మద్ పండిట్, మహ్మద్ రఫీ షేక్, బుర్హాన్ ముస్తాక్ వానీగా వెల్లడించారు.  వారికి సహకరిస్తున్న స్థానిక యువకులను కూడా ఉగ్రవాద సంస్థలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.   

ముష్కరుల వద్ద స్వాధీనం చేసుకున్న భారీ ఆయుధాల డంప్  ను పోలీసులు మీడియాకు చూపించారు. అందులో 3 ఏకే-47 రైఫిల్స్, 8 ఏకే-47 మ్యాగజీన్స్, 332 ఏకే-47 గుండ్లు, 12 హ్యాండ్ గ్రనేడ్లు, 3 పిస్టళ్లు, 6 పిస్టల్ మ్యాగజీన్స్ ఉన్నాయి..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News