ఎస్‌బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న కథనాలపై ఎస్‌బీఐ స్పందించింది. మినిమమ్ బ్యాలెన్స్‌లపై కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే మినిమమ్ బ్యాలెన్స్‌లను ఏప్రిల్ నుంచి 40 శాతం తగ్గించామని.. 40 శాతం సేవింగ్స్ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని తెలిపింది. వీటితో పాటు ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజన్ స్కీన్ జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్, పీఎంజేడీఐ/బీఎస్‌బీడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్స్ అకౌంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎస్‌బీఐ ప్రకటించింది.
Effective, April 2018, SBI has reduced the AMB requirement by up to 40%, and the charges for non-maintenance of AMB have been reduced to be one of the lowest in the industry. pic.twitter.com/1c0lGmE4i1
— State Bank of India (@TheOfficialSBI) August 6, 2018
మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌లలో ఉండే బ్రాంచును బట్టి నెలవారీ మినిమన్ బ్యాలెన్స్ అకౌంట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఖాతాదారుడు కనుక మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించకపోతే జరిమానా విధిస్తారు.
ఎస్‌బీఐ బ్రాంచ్ టైప్‌ను బట్టి బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్: మెట్రో-రూ.3000, అర్బన్-రూ.3000, సెమీ అర్బన్- రూ.2000, రూరల్- రూ.1000
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న సాకుతో ఖాతాదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని బ్యాంకింగ్ డేటాలో వెల్లడైన సంగతి తెలిసిందే. వీటిలో ఎస్‌బీఐ అత్యధికంగా రూ.2,433.87 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశాయి.