ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 84 వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి.

Last Updated : Mar 17, 2018, 01:14 PM IST
ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ, మార్చి 17: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 84వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు, రాజకీయ వ్యూహాలకు పార్టీ సీనియర్ నేతలు తొలిరోజు తుది రూపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ జాతీయ జెండాను ఊపి, జాతీయ గీతాలాపన చేసి ప్లీనరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భావ సారుప్యత కలిగిన పార్టీలతో పొత్తుపెట్టుకోవాలని రాజకీయ తీర్మానంలో పొందుపరిచారు.రాజకీయ తీర్మానంతో పాటు ఉద్యోగాలు, వ్యవసాయం, పేదరిక నిర్మూలన పై కూడా చర్చించి తీర్మానాన్ని ఆమోదించనున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ఈ ప్లీనరీని వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్లీనరీలో సోనియా గాంధీ కూడా ప్రసంగిస్తారని సమాచారం.

ఏఐసీసీ ప్లీనరీ ఏపీకి ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఆమోదించనుంది. న్యూఢిల్లీలో ఈ రోజు నుంచి జరగనున్న కాంగ్రెస్ ప్లీనరీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తీర్మానాన్ని ప్రవేశ పెడతారని సమాచారం. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగే ఈ ప్లీనరీలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.

Trending News