Oxygen Plants: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మితం కానున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దేశంలో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)వస్తే ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని..డీఆర్డీవో ఛీఫ్ సతీష్ రెడ్డి తెలిపారు. మూడవ వేవ్ వస్తే ఏం చేయాలనేది ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చిస్తోందన్నారు. పీఎం కేర్స్ నిధులతో దేశంలోని పలు జిల్లాల్లో 850 ఆక్సిజన్ ప్లాంట్లను(Oxygen Plants) డీఆర్డీవో(DRDO) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పలు తాత్కాలిక ఆసుపత్రుల్ని నిర్మించినట్టు చెప్పారు ఈ ఆసుపత్రుల్ని ఫ్లైయింగ్ ఆసుపత్రులుగా పిలుస్తున్నామన్నారు. ఆసుపత్రుల్నించి వైరస్ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా నాణ్యమైన టెక్నాలజీని తాము తయారు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేథ కూడా కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్ వస్తే..ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తామన్నారు.
Also read: India Corona Recovery Rate: ఇండియాలో 95.64 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook