8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు.. 8వ వేతన సంఘంపై నిర్ణయం..?

8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..?   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 12:22 PM IST
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు.. 8వ వేతన సంఘంపై నిర్ణయం..?

8th Pay Commission Update: డియర్‌నెస్ అలవెన్స్‌ పెంపు ప్రకటన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఏడవ వేతన సంఘం కింద జీతాలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే సిఫారసుల ప్రకారం తమకు జీతం అందడం లేదని.. తమకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బు పొందుతున్నారని ఉద్యోగుల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు 8వ వేతన సంఘం ప్రకారం జీతాలు చెల్లించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి మెమోరాండం సిద్ధం చేస్తున్నామని.. త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని ఉద్యోగుల సంఘాల నాయకులు చెబుతున్నారు.  

మరోవైపు 8వ వేతన సంఘం అమలు అంశంపై ప్రస్తుతం ఎలాంటి పరిశీలన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి వేతన సంఘం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ మొదలైంది. ప్రస్తుతం కనీస వేతన పరిమితిని రూ.18 వేలుగా ఉంది. ఇందులో ఇంక్రిమెంట్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 7వ వేతన సంఘంలో దీన్ని 3.68 రెట్లు పెంచాలని సిఫార్సు చేసినప్పటికీ ఈ అంశం 2.57 రెట్లు ఉంది. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది. 

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమయంలోనే 8వ వేతన సంఘం అమలు ప్రణాళికకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు ఆశించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇటీవల తాజా నివేదికలు 8వ వేతన సంఘంపై ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సంఘం నిబంధనలు మారుతున్న విషయం తెలిసిందే. 5వ, 6వ, 7వ పే కమిషన్ల అమలులో ఈ నమూనా కనిపించింది.
 
4వ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతం ఎంత పెరిగింది..? 
==> శాలరీ హైక్- 27.6%
==> బేసిక్ శాలరీ-రూ.750
5వ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతం ఎంత పెరిగింది..? 
==> శాలరీ హైక్-31%
==> బేసిక్ శాలరీ-రూ.2,550 
6వ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతాన్ని ఎంత పెరిగింది..?
==> ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్-1.86 రెట్లు
==> జీతం పెంపు-54 శాతం,
==> బేసిక్ శాలరీ-రూ.7 వేలు 
7వ వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతం ఎంత పెరిగింది..?
==> ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్-2.57 రెట్లు
==> జీతం పెంపు-14.29 శాతం
==> బేసిక్ శాలరీ-రూ.18 వేలు 

అదేవిధంగా ఇప్పుడు 7వ వేతన సంఘం తర్వాత కొత్త పే కమిషన్ రాదనే ప్రచారం కూడా ఉంది. ఇందుకు బదులుగా ప్రభుత్వం అదే బెనిఫిట్స్‌తో కొత్త విధానాన్ని అమలు చేయబోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇది 'ఆటోమేటిక్ పే రివిజన్ సిస్టమ్' కావచ్చు. ఇందులో డీఏ 50 శాతం కంటే ఎక్కువ ఉంటే.. జీతంలో ఆటోమేటిక్ రివిజన్ ఉంటుంది. ఇదే జరిగితే 68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందనున్నారు.

Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం  

Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News