పాన్-ఆధార్ ఆసంధాన గడువు మరోసారి పెంపు

పాన్-ఆధార్ ఆసంధాన గడువు మరోసారి పెంపు

Last Updated : Jul 1, 2018, 03:28 PM IST
పాన్-ఆధార్ ఆసంధాన గడువు మరోసారి పెంపు

పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించే గడువును కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)మరోసారి పొడిగించింది. జూన్ 30తో గడువు ముగిసిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31వరకు ఆధార్‌తో అనుసంధానానికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడిచింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 119 మేరకు సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. పాన్ కార్డు-ఆధార్ అనుసంధాన గడువును పెంచడం ఇది ఇదోసారి. ఈ ఏడాది మార్చి 27న చివరిసారి పొడిగించారు. ఆధార్‌తో సేవల అనుసంధానం కోసం ఇచ్చిన గడువును మార్చి 31, 2018 నుంచి పొడిగించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుంది.

పాన్ కార్డుతో ఆధార్‌తో అనుసంధానం

  • https:/// incometaxindiaefiling.gov.in వెబ్‌సైటులోకి వెళ్లండి. అక్కడ కుడివైపున ‘లింక్‌ ఆధార్‌’ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే.. పాన్‌, ఆధార్‌ నెంబరు, ఆధార్‌లో పేర్కొన్న పేరు యథాతథంగా పేర్కొనాలని సూచిస్తూ మరో స్క్రీన్‌ వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నీ సరిగా నింపండి.
  • మీ ఆధార్‌లో పేర్కొన్న పేరు, పాన్‌ కార్డులో ఉన్న పేరు ఒకటే అయితే.. యూఐడీఏఐ నుంచి దాన్ని ధ్రువీకరించుకొని, మీ పాన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం అయినట్లుగా సమాచారం వస్తుంది.
  • ఆధార్‌, పాన్‌లో పేర్కొన్న పేర్లలో చిన్న మార్పులుంటే.. ఆధార్‌లో పేర్కొన్న మొబైల్‌ నెంబరు, ఈమెయిల్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. అది టైపు చేసి link aadhar అని ఆప్షన్ క్లిక్ చేయాలి.
  • ఒకవేళ మీరు ముందుగానే ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసి ఉంటే మీకు ఎడమ వైపు పైన click here అని కనిపిస్తుంది దాని క్లిక్ చేస్తే మన స్టేటస్ ని తెలుసుకోవచ్చు.
  • మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ ఐపోయింది అని తెలుసుకోవాలి అంటే ముందుగా చెప్పినట్లు click here అని క్లిక్ చేస్తే మీకు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత view my Aadhar Status అనే దానిపై క్లిక్ చేయాలి. అది చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేయబడుతుంది.
  • పాన్‌, ఆధార్‌లో పేర్కొన్న పేర్లలో పూర్తి తేడా ఉండొచ్చు. అలాంటప్పుడు పాన్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైటులో లేదా ఆధార్‌కు సంబంధించి యూఐడీఏఐ వెబ్‌సైట్లలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, 80ఏళ్లు దాటిన వారికి, ప్రవాస భారతీయులకు దీని నుంచి మినహాయింపు ఉంది.

 

Trending News